ఓట్స్ ఇడ్లీ తయారుచేసుకోండిలా..
TV9 Telugu
10 May 2024
ఓట్స్ ఇడ్లి కోసం కావలసిన పదార్ధాలు: రోల్డ్ ఓట్స్ లేదా ఇనిస్టెంట్ ఓట్స్, చిలికిన పెరుగు, నూనె , శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు
వీటితో పాటు తరిగిన ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, తురిమిన క్యారెట్, కరివేపాకులు, తరిగిన కొత్తిమీర, ఉప్పు, నీరు
ముందుగా ఓట్స్ ను మిక్సీలో బరకగా పొడి పట్టుకోవాలి.. తర్వాత దానిని ఒక పెద్ద బౌల్ లోకి తీసుకోవాలి. కొంచెం రోల్డ్ ఓట్స్ ను వేసుకోవాలి.
ఇంతలో గ్యాస్ స్టౌ ఆన్ చేసి మీద బాణలి పెట్టి.. నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేయించాలి.
తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వేసి కొంచెం సేపు వేయించిన తర్వాత.. స్టౌ మీద నుంచి దించి చల్లారనివ్వాలి.
చల్లారిన తర్వాత ఓట్స్ పొడి లో వీటిని వేయాలి.. దానిలో క్యారట్ తురుము, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి.
తర్వాత చిలికిన పెరుగుని వేసి ఇడ్లి మిక్స్ రెడీ చేసుకోవాలి. ఉప్పు వేసి… ఐదు నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
ఇడ్లి స్టాండ్ లో ఆ పిండిని ఇడ్లి లా వేసుకుని ఆవిరి మీద ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే వేడి వేడి ఓట్స్ ఇడ్లీ రెడీ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి