Breaking News
  • హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పూజ ప్రారంభం. 66 వ సంవత్సరం మహావిష్ణువు రూపంలో దర్శానమివ్వనున్న ఖైరతాబాద్ గణనాధుడు. శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతి గా నామకరణం. ఒక వైపు లక్ష్మిదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు. పర్యావరణ హితంగా ఖైరతాబాద్ గణ నాధుడు. మట్టితో తయారు చేసి అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాటు. ఈ సారి 9 అడుగుల ఎత్తులో దర్శన మివ్వనున్న ఖైరతాబాద్ గణపతి. భక్తులు ఎవ్వరు రావద్దు ఆన్ లైన్ ద్వారా దర్శనము చేసుకోగలరని విజ్ఞప్తి చేసిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ.
  • విజయవాడ: ఏపీ స్టేట్ ఎలక్షన్ కమీషన్. ఎలక్షన్ కమీషనర్ కార్యాలయంలో వాస్తు మార్పులు అన్న వార్తలు అవాస్తవం. ఎటువంటి నమ్మకాలకు తావులేని వ్యక్తి ఎలక్షన్ కమీషనర్. ఆయన లేని సమయంలో కార్యాలయంలో కొన్ని మార్పులు జరిగాయి. కార్యాలయంలో మార్పులను ఎవరు నిర్ధారించారో విచారణ జరుగుతోంది.
  • గడిచిన 24 గంటల్లో ఢిల్లీ లో 1076 కొత్త పాజిటివ్ కేసులు,11 మంది మృతి. ఢిల్లీవ్యాప్తంగా 140232 కేసులు నమోదు. 10072 యాక్టీవ్ కేస్ లు. 126116 మంది డిశ్చార్జ్. మొత్తం 4044 మంది మృతి
  • రెండు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు కృష్ణ నీటి పంపకాలు చేపట్టిన కృష్ణ మేనేజ్మెంట్ బోర్డు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణ వాటాగా 37.672 టీఎంసీలు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ఆంధ్ర ప్రదేశ్ వాటాగా 17 టీఎంసీలు.
  • చెన్నై: చెన్నై విమానాశ్రయం లో వరుసగా పట్టుబడుతున్న బంగారం . దుబాయ్ నుండి చెన్నై కి అక్రమంగా తరలిస్తున్న 731 గ్రాముల బంగారం స్వాధీనం . పట్టుబడ్డ బంగారం విలువ 35 లక్షలు ,బంగారాన్ని పేస్ట్ రూపం లో మార్చి అక్రమ రవాణా చేస్తున్న ముఠా . తంజావూర్ కి చెందిన ఇద్దరు అరెస్ట్ చేసి విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు . నిన్న సాయంత్రం 83 లక్షలు విలువ చేసే 1 .48 కేజీల బంగారం పట్టుకున్న అధికారులు.
  • విజయవాడ: బీజేపీ నుండి మరో నేత సస్పెండ్. పార్టీ లైన్ కి భిన్నంగా మాట్లాడుతున్న వారిని వరసగా సస్పెండ్ చేస్తున్న బిజెపి. ఇప్పటికే పలువురు నేతలు సస్పెండ్.. మరి కొంత మందికి నోటీసులు ఇచ్చిన ఏపీ బీజేపీ. లేటెస్ట్ గా మరొకరు తిరుపతి కి చెందిన ఓ వి రమణ సస్పెండ్. మూడు ముక్కలాట లో నష్టపోతున్న బీజేపీ అని ఒక దిన పత్రికలో ఆర్టికల్ రాసిన తిరుపతి కి చెందిన బీజేపీ నేత ఓ వి రమణ .
  • అమరావతి: ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథార్టీ బిల్లుకు గవర్నర్ ఆమోదం. ఆక్వా అభివృద్ధి, ఆక్వా కల్చర్ మానిటర్, ప్రమోట్, రెగ్యులేషన్ లక్ష్యాలుగా ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథార్టీ చట్టాన్ని రూపొందించిన ప్రభుత్వం. ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం.

బిహార్ లో మళ్లీ పిడుగుల బీభ‌త్సం.. 22 మంది మృతి

బిహార్‌ను భారీ వర్షాలు వదిలీ పెట్టడంలేదు. మరోసారి రాష్ట్రంలో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలతోపాటు పిడుగులు ప‌డి 22 మంది మృత్యువాతపడ్డారు. ఇటీవలే ఒకేరోజు 83 మంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌ మ‌రువ‌క‌ముందే మ‌రోసారి విషాద చోటుచేసుకుంది.
Bihar thunderstorm today 22 members Died, బిహార్ లో మళ్లీ పిడుగుల బీభ‌త్సం.. 22 మంది మృతి

బిహార్‌ను భారీ వర్షాలు వదిలీ పెట్టడంలేదు. మరోసారి రాష్ట్రంలో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలతోపాటు పిడుగులు ప‌డి 22 మంది మృత్యువాతపడ్డారు. ఇటీవలే ఒకేరోజు 83 మంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌ మ‌రువ‌క‌ముందే మ‌రోసారి విషాద చోటుచేసుకుంది. బిహార్ రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉద‌యం నుంచి ఎడతెరిపిలేకుండా ఉరుములు, మెరుపుల‌తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప‌లుచోట్ల పిడుగులు బీభ‌త్సం సృష్టించాయి. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు ప‌డి ఇవాళ ఒక్క‌రోజే 22 మంది చనిపోయారు. ఈ ఘటనలపై స్పందించిన ఆ రాష్ట్రప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మారం చేసింది.
కాగా, ఈ విషాద‌క‌ర‌ ఘ‌ట‌న‌ల‌పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన బిహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్.. మృతుల కుటుంబాల‌కు అండగా నిలుస్తానన్నారు. పిడుగుపాట్ల‌కు బ‌లైన 22 మంది కుటుంబాల‌కు ఒక్కొక్కరికి రూ.4 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. కాగా, గ‌త 10 రోజుల వ్య‌వ‌ధిలోనే దాదాపు 120 మంది పిడుగుపాట్ల‌కు బ‌లికావ‌డంతో బీహార్ ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. అటు, మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ‌

Related Tags