రేషన్‌ కార్డులేని వారికి ఊరట.. గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం..!

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సామాన్య ప్రజలుతీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉపాధి లేకపోవడంతో నిత్యవసర సరకులు కొనేందుకు కూడా డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా రేషన్ సరకులను అందిస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ ఖాతాలున్న మహిళలకు నెలకు రూ.500/- మూడు నెలలపాటు వేయనుంది. తొలి విడతగా ఏప్రిల్‌లో రూ.500/- జమచేసింది. ఇక […]

రేషన్‌ కార్డులేని వారికి ఊరట.. గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం..!
Follow us

| Edited By:

Updated on: Apr 22, 2020 | 4:27 PM

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సామాన్య ప్రజలుతీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉపాధి లేకపోవడంతో నిత్యవసర సరకులు కొనేందుకు కూడా డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా రేషన్ సరకులను అందిస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ ఖాతాలున్న మహిళలకు నెలకు రూ.500/- మూడు నెలలపాటు వేయనుంది. తొలి విడతగా ఏప్రిల్‌లో రూ.500/- జమచేసింది. ఇక పలు రాష్ట్రాలు రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు నెలకు రూ.1000/- నుంచి 1500/- వరకు జమ చేస్తున్నాయి. అయితే రేషన్ కార్డు లేని వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో బీహార్‌ సీఎం రేషన్ కార్డు లేని వారందరికీ ఓ శుభవార్త తెలిపారు. ఇక వారందరికీ రూ.1000/- ఆర్ధిక సహాయం చేయనున్నట్లు బీహార్‌ సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతంలో రేషన్ కార్డులు లేని వారందరినీ గుర్తించేందుకు ప్రత్యేకంగా సర్వే చేయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రేషన్ కార్డు హోల్డర్లందరికీ రూ.1000/- నగదు సాయం చేసింది. ఇప్పుడు జీవిక సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్‌ టీంలతో సర్వే చేయించి.. అర్హులందరికీ వెంటనే రూ.1000/- ఆర్ధిక సహాయం చేయనున్నట్లు తెలిపారు. దీని కోసం ఇప్పటికే సీఎం చీఫ్ సెక్రటరీ.. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీచేశారు. అంతేకాదు వడగళ్ల వర్షాల వల్ల.. పంటలు నష్టపోయిన రైతులందరికీ సబ్సీడీలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.