బిగ్ బాస్: కూతురి ప్రేమ.. తండ్రి ఆగ్రహం.. హౌస్‌లో భావోద్వేగ క్షణాలు!

Losliya Father Enters Into Bigg Boss House, బిగ్ బాస్: కూతురి ప్రేమ.. తండ్రి ఆగ్రహం.. హౌస్‌లో భావోద్వేగ క్షణాలు!

లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తమిళ బిగ్ బాస్ అత్యంత ఎమోషనల్‌గా సాగుతోంది. ఈ షో చివరి దశకు చేరుకోవడంతో హౌస్‌లోకి కుటుంబసభ్యులను అనుమతించారు. కొందరు తమ కుటుంబసభ్యులను చూసి భావోద్వేగానికి లోనయితే.. మరికొందరు కంటతడి పెట్టుకున్నారు. ఇక షోలోనే విపరీతమైన ప్రేక్షాధారణ పొందిన నటి లోస్లియాకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. హౌస్‌లోకి వచ్చిన ఆమె తండ్రి కూతుర్ని ఓదార్చడం అటుంచి.. ఆగ్రహం వ్యక్తం చేశాడు.

నటి లోస్లియా, కెవిన్ మధ్య హౌస్‌లో ప్రేమ వ్యవహారం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాకుండా లోస్లియా అందం, ఆమె ఇచ్చి ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కానీ ఈ ప్రేమ విషయమే ఆమె తండ్రికి రుచించలేదు. ఆమె తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  ‘నేను నిన్ను పెంచిన పద్ధతి ఇదేనా?’ అంటూ కోపం వ్యక్తం చేశారు. తండ్రిని చూసి లోస్లియా ఆనందం పడేలోపే.. ఆయన కోపాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమైంది. మరో కంటెస్టెంట్‌ చేరన్‌ లోస్లియా తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. ఆయన కాస్త శాంతించారు. అప్పుడు లోస్లియా తండ్రిని హత్తుకుని ఏడ్చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *