Bigg Boss 4: బాలయ్య పాటకు గంగవ్వ అదిరిపోయే స్టెప్పులు

బిగ్‌బాస్‌లో సండేను ఫన్‌డేగా చేశారు నాగార్జున. సరదా టాస్క్‌లు, ఆటలతో కంటెస్టెంట్‌లతో పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు

Bigg Boss 4: బాలయ్య పాటకు గంగవ్వ అదిరిపోయే స్టెప్పులు

Updated on: Sep 21, 2020 | 7:58 AM

Bigg Boss 4 Gangavva: బిగ్‌బాస్‌లో సండేను ఫన్‌డేగా చేశారు నాగార్జున. సరదా టాస్క్‌లు, ఆటలతో కంటెస్టెంట్‌లతో పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. ఇక ఈ వారం నాగార్జున ఇచ్చిన డాగ్‌ అండ్‌ బోన్‌ గేమ్‌లో గంగవ్వ పాల్గొని అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ గేమ్‌లో కుమార్‌ సాయి, గంగవ్వ పోటీ పడ్డారు. ఈ క్రమంలో బాలయ్య పైసా వసూల్ సినిమాలోని టైటిల్ సాంగ్‌ పెట్టగా.. వారిద్దరు బోన్ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ వేశారు. ఈ పాటకు గంగవ్వ మడత పెట్టి స్టెప్పులు వేశారు. అంతేకాదు ఆఖరులో ఆ బోన్‌ని తీసుకొని కుమార్ సాయిని పరుగులు పెట్టించారు. గత వారంలో రెండు రోజులు గంగవ్వ ముభావంగా ఉండటం ఆమె ఫ్యాన్స్‌ని కాస్త బాధించగా.. ఇప్పుడు మళ్లీ ఆమె యాక్టివ్ అవ్వడంతో ఇటు ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేశారు. ఈసారి ఎలాగైనా గంగవ్వను బిగ్‌బాస్ విన్నర్‌ని చేయాలని వారు అనుకుంటున్నారు.

Read More:

Bigg Boss 4: ఎలిమినేట్ అయిన హారిక.. ఊహించని ట్విస్ట్‌

దేశంలో 60 శాతం విద్యార్ధులు కాలినడకనే స్కూళ్లకు.. ఎన్ఎస్ఓ సర్వే

Loading...
Unable to load recommendations.
Follow Us