Breaking News
  • అమరావతి: ఏపీ జర్నలిస్ట్‌ అక్రిడేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ. 2 వారాల్లో అక్రిడేషన్ల పునరుద్ధరణ చేయాలని ఆదేశం. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలన్న హైకోర్టు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా .
  • రేపు వరద ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన. ఉ.9కు తార్నాకలోని మణికేశ్వర్‌నగర్‌లో పర్యటించనున్న కిషన్‌రెడ్డి . అనంతరం మెట్టుగూడ, అంకమ్మ బస్తీ, శ్యామలకుంట, ఓల్డ్‌ప్రేమ్‌నగర్‌.. నరేంద్రనగర్‌లోని ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న కేంద్రమంత్రి. సా.5గంటలకు జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్‌ చెరువు పరిశీలన.
  • అనంతపురం: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసు. కర్నాటక లోకాయుక్తలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి. వాహనాల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో.. కర్నాటక అధికారులపై ఫిర్యాదు చేసినప్పుడు ఏపీలో ఎందుకు చేయలేదని ప్రశ్న . చట్టం మీ చేతుల్లో ఉందని మమ్మల్ని అక్రమంగా అరెస్ట్‌ చేస్తారా. బీఎస్‌3 కన్నా ముందున్న వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పనిచేయడం లేదు. చట్టం తమ చేతుల్లో ఉందని ఇష్టమొచ్చినట్టు కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా మరోసారి జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధం-తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి.
  • విజయవాడ: దుర్గగుడి అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి వెల్లంపల్లి, దేవాలయాల అభివృద్ధి పట్ల సీఎం జగన్‌ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం-వెల్లంపల్లి.
  • హైదరబాద్: వరదల్లో ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ, డూప్లికేట్‌ మెమోరాండం ఆఫ్‌ మార్క్స్‌ కోసం వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు-ఇంటర్మీడియట్‌ బోర్డ్‌, సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌.
  • అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం . రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు. -అమరావతి వాతావరణ కేంద్రం.
  • తుళ్లూరు రిటైర్డ్‌ తహశీల్దార్‌ సుధీర్‌బాబు క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత. రాజధాని అసైన్డ్‌ భూముల కుంభకోణంలో సుధీర్‌బాబుపై సీఐడీ కేసు. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని ఏపీ హైకోర్టులో సుధీర్‌బాబు పిటిషన్‌. సుధీర్‌బాబుతో పాటు విజయవాడకు చెందిన సురేష్‌ అరెస్ట్‌.

దేశంలో 60 శాతం విద్యార్ధులు కాలినడకనే స్కూళ్లకు.. ఎన్ఎస్ఓ సర్వే

నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ తాజాగా విద్యపై చేసిన ఓ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. దేశంలో ప్రస్తుతం దాదాపుగా 59.7 శాతం మంది విద్యార్ధులు కాలినడకనే...

NSO Survey On Education, దేశంలో 60 శాతం విద్యార్ధులు కాలినడకనే స్కూళ్లకు.. ఎన్ఎస్ఓ సర్వే

నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ తాజాగా విద్యపై చేసిన ఓ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. దేశంలో ప్రస్తుతం దాదాపుగా 59.7 శాతం మంది విద్యార్ధులు కాలినడకనే పాఠశాలలకు వెళ్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఇక ఈ సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లోనే చాలా ఎక్కువగా ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో కాలినడకన పాఠశాలకు వెళ్లే బాలికల శాతం 66.5 శాతం ఉండగా.. బాలురు 61.4 శాతంగా ఉండటం గమనార్హం. అలాగే పట్టణ ప్రాంతాల్లో బాలురు 57.9 శాతం కాగా.. బాలికలు 62 శాతంగా ఉంది. అటు దేశంలో 12.4 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు ప్రజా రవాణా ద్వారా వెళ్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 11.3 శాతం విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు సైకిల్ ఉపయోగిస్తున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో 15.3 మంది విద్యార్ధులు ప్రజా రవాణాలో స్కూల్స్ కి చేరుకుంటున్నారు. (NSO Survey On Education)

ఈ సర్వేలో విద్యార్ధుల ఇంటి నుంచి పాఠశాలల మధ్య దూరాన్ని కూడా అధ్యయనం చేశారు. పట్టణ ప్రాంతాల్లో 87.2 శాతం గృహాలకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 92.7 శాతం గృహాలకు ఒక కిలోమీటర్ దూరంలో ప్రాధమిక పాఠశాల ఉన్నట్లు గుర్తించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 68 శాతం గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 80 శాతం గృహాలకు 1 కిలోమీటర్ వ్యవధిలో ఉన్నత పాఠశాలలు ఉన్నట్లు స్పష్టమైంది. అటు 38 శాతం గ్రామీణ కుటుంబాలకు, 70 శాతం పట్టణాల్లో ఉండేవారికి ఉన్న ఒక కిలోమీటర్ దూరంలో సెకెండరీ, సీనియర్ సెకెండరీ పాఠశాలలు ఉన్నట్లు గుర్తించారు.

Related Tags