Bigg Boss 4: ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్.. ఆ ముగ్గురిలో ఒకరు ఔట్..!

|

Sep 11, 2020 | 1:28 PM

బిగ్‌బాస్.. వివాదాలకు, కొట్లాటలకు, లవ్ ఎఫైర్లకు పురుడు పోసే ప్రత్యేక గేమ్‌ షో. కరోనా విరామం తర్వాత ఎంతో హైప్‌తో మొదలైన తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Bigg Boss 4: ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్.. ఆ ముగ్గురిలో ఒకరు ఔట్..!
Follow us on

Bigg Boss 4: బిగ్‌బాస్.. వివాదాలకు, కొట్లాటలకు, లవ్ ఎఫైర్లకు పురుడు పోసే ప్రత్యేక గేమ్‌ షో. కరోనా విరామం తర్వాత ఎంతో హైప్‌తో మొదలైన తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. మొదటి రోజు 16 మంది కంటెస్టెంట్ల ఎంట్రీతో మొదలైన ఈ షో.. ఆ తర్వాత రోజు అభిజిత్‌ను హైలైట్ చేసింది. ఇక నెక్స్ట్ నోయల్ హైలైట్ కాగా, నిన్నటి ఎపిసోడ్‌లో దివి దుమ్ము దులిపేసిందని చెప్పాలి. మూడు రోజులుగా మౌనంగా ఉంటూ ఏ గొడవల్లోకి తలదూర్చని దివి.. కంటెస్టెంట్లను చాలా బాగా అర్ధం చేసుకుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్స్‌లో అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్థక్, దివి, మెహబూబా, సుజాత, గంగవ్వలు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిలో గంగవ్వ, అభిజిత్, దివి, మెహబూబ్‌లు సేఫ్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అటు సుజాత, అఖిల్, సూర్యకిరణ్‌లలో ఒకరి ఈ వారం హౌస్ నుంచి బయటికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మరి అది ఎవరో తెలియాలంటే ఈ ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.

Also Read: 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 11న ఖాతాల్లోకి నగదు జమ.!

బ్యాంక్ కస్టమర్లకు షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్..

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..