Bigg Boss 4 Telugu: బుల్లితెరపై బిగ్‌బాస్ విజయవంతంగా కొనసాగుతోంది. రోజురోజుకు ఎంటర్‌టైన్‌మెంట్ పెంచడంతో పాటు హౌజ్‌లోని కంటెస్టెంట్‌ల పర్ఫామెన్స్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఇక హౌజ్‌లోకి వెళ్లినప్పటి నుంచి మోనాల్‌తో పులిహోర కలుపుతూ వచ్చిన అభిజిత్.. ఇప్పుడు ఆమెకు కాస్త దూరమవుతున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ఎపిసోడ్‌లలో అభిజిత్, హారికకు దగ్గరవుతున్నారు. ఇక గురువారం ఎపిసోడ్‌లో టాస్క్ ముగిసిన తరువాత తొలిసారి అభిజిత్‌పై వ్యతిరేకత వ్యక్తం చేసింది మోనాల్. అభి ఉన్నచోట తాను ఉండలేనని, అతడు రేషన్ మేనేజర్‌గా ఉన్నాడు కాబట్టి తాను కిచెన్‌లో చేయనని నోయెల్‌కి చెప్పింది మోనాల్. ఈ విషయంలో మోనాల్‌కి నోయెల్ సర్ది చెప్పాడు.
మరోవైపు హారిక, అభిజిత్‌లు ఎప్పటిలాగే మాట్లాడుకుంటూ చేయి చేయి కలిపారు. నువ్వు చాలా బాగా ఆడావు. చాలా సూపర్ అంటూ హారిక, అభిజిత్‌కి కితాబిచ్చింది. ఇక అభి కూడా ఆమె చేతిలో చేయి వేశారు. దీంతో వీరిద్దరి మధ్య లవ్‌స్టోరీ స్టార్ట్ అయ్యిందని వీక్షకులు భావిస్తున్నారు.
Read More:
బాలు హెల్త్ అప్డేట్ : ఏ నిమిషాన ఏమి వినాల్సి వస్తుందోనన్న ఆందోళన