Bigg Boss 4: అమ్మాయిలకు అండగా కింగ్‌, కెప్టెన్‌పై కొరడా

బిగ్‌బాస్‌ 4 ఇవాళ వారంతం ఎపిసోడ్‌పై కాస్త గందరగోళం నెలకొంది. సాధారణంగా ఇవాళ ఎలిమినేషన్ ఎపిసోడ్ ఉంటుంది.

Bigg Boss 4: అమ్మాయిలకు అండగా కింగ్‌, కెప్టెన్‌పై కొరడా

Updated on: Oct 10, 2020 | 4:53 PM

Nagarjuna Bigg Boss 4: బిగ్‌బాస్‌ 4 ఇవాళ వారంతం ఎపిసోడ్‌పై కాస్త గందరగోళం నెలకొంది. సాధారణంగా ఇవాళ ఎలిమినేషన్ ఎపిసోడ్ ఉంటుంది. ఈసారి ఎలిమినేషన్‌లో మొత్తం 9 మంది ఉండగా.. వారు కాకుండా ఎలిమినేట్ అవ్వని గంగవ్వ హౌజ్‌ నుంచి బయటకు రాబోతున్నట్లు లీక్ వీరులు చెబుతున్నారు. అనారోగ్య కారణాల వలనే గంగవ్వను బిగ్‌బాస్‌ బయటకు పంపించబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ రోజు ఎపిసోడ్‌కి సంబంధించి ఓ ప్రోమో విడుదలైంది. అందులో నాగార్జున కంటెస్టెంట్‌లకు బాగా క్లాస్ పీకారు. ముఖ్యంగా మొన్నటి నామినేషన్‌ ప్రాసెస్‌లో మోనాల్ విషయంలో అభిజిత్, అఖిల్ మధ్య జరిగిన రచ్చ నేపథ్యంలో ఆ ఇద్దరిని బాగా తిట్టారు. అలాగే అమ్మ రాజశేఖర్ ప్రవర్తనపై నాగ్ మండిపడ్డారు. చివరగా నామినేషన్ సమయంలో దివిపై సొహైల్‌ అరిచిన తీరుపై నాగ్ కోపడ్డారు. ఇంకోసారి హౌజ్‌లో అమ్మాయిలపై అరిస్తే దెబ్బలు తప్పవంటూ నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌లకు నాగ్‌ మరింత క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అదంతా చూడాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

Read More:

ఆరు నెలలుగా కరోనా రోగులకు సేవలందిస్తోన్న నటికి పాజిటివ్‌

నిశ్శబ్దం.. అభిమానికి సారీ చెప్పిన మాధవన్‌

Loading...
Unable to load recommendations.
Follow Us