Bigg Boss 4: కరోనా విరామం తర్వాత ఫుల్ జోష్‌తో ‘బిగ్ బాస్’ సీజన్ 4 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక హౌస్‌లోకి ఎంటరైన 16 మంది కంటెస్టెంట్ల మధ్య అప్పుడే కొట్లాటలు, ఏడుపులు, పెడబొబ్బలు మొదలైపోయాయి. ఇక ఈలోపే మొదటి వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేది ఎవరూ అనే దానిపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చ జరుపుతుండడం విశేషం.
ఇదిలా ఉంటే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్‌కు అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్థక్, దివి, మెహబూబా, సుజాత, నామినేట్ అయ్యారని తెలిసిన విషయమే. అటు సోషల్ మీడియాలో నిర్వహిస్తున్న పోలింగ్ ప్రకారం.. ఎక్కువ శాతం పోల్స్‌లో గంగవ్వ, అభిజిత్, మెహబూబ్‌లు మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అఖిల్, దివి, సుజాత, సూర్యకిరణ్‌లకు మోస్తరుగా ఓట్లు పడినట్లు సమాచారం. చివరి రెండు స్థానాల్లో సూర్య కిరణ్, దివిలు ఉన్నారని టాక్. మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటికి వెళ్తారో అనేది చూడాలి.