Bigg Boss 4: ఇంప్రెస్ అయిన మోనాల్.. జోరు పెంచిన అవినాష్

మూడో వారం బిగ్‌బాస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇంకొంత పెరిగింది. ఓ వైపు హౌజ్‌లోని సభ్యులు ఎంటర్‌టైన్‌మెంట్ తమలోని జోష్‌ని

Bigg Boss 4: ఇంప్రెస్ అయిన మోనాల్.. జోరు పెంచిన అవినాష్

Updated on: Sep 23, 2020 | 8:10 AM

Bigg Boss 4 Telugu: మూడో వారం బిగ్‌బాస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇంకొంత పెరిగింది. ఓ వైపు హౌజ్‌లోని సభ్యులు ఎంటర్‌టైన్‌మెంట్ తమలోని జోష్‌ని చూపిస్తుండగా.. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఇన్ని రోజులు మోనాల్, అభిజిత్‌, అఖిల్ మధ్య ట్రయాంగిల్‌ స్టోరీలోకి ఇప్పుడు అవినాష్ వచ్చి చేరాడు. గతవారం హౌజ్‌లోకి వైల్డ్‌ కార్డ్‌ ద్వారా వచ్చీ రాగానే మోనాల్‌తో పులిహోర కలిపేందుకు ప్రయత్నించిన అవినాష్‌కి ఆమె గట్టి హెచ్చరికనే జారీ చేసింది. దీంతో అవినాష్ కాస్త వెనక్కి తగ్గాడు. అయితే  రోజురోజుకు పరిస్థితులు మారుతున్నాయి

మోనాల్‌ మెల్లమెల్లగా అతని జోకులకు అట్రాక్ట్ అవుతోంది. అంతేకాదు నీ వాయిస్‌లో బేస్ ఉందని పొగడటం మొదలుపెట్టింది. ఇక తనలోని మాటలు మనసులో నుంచి వస్తాయని అవినాష్ చెప్పగా.. పులిహోర కలపడంలో అఖిల్, అభిలను మించిపోయేట్టుగానే అతడు కనిపించాడు.

ఉంగరాల జుట్టు వాడిని అంటూ.. పాట పాడుతూ వచ్చిన అవినాష్‌, మోనాల్‌ సో బ్యూటిఫుల్ అంటూ బిస్కెట్ల వర్షం కురిపించాడు. ఇక మొనాల్‌తో కలిసి ఇది ఫన్ అంటూ హౌస్ మొత్తం చిందులు వేశాడు అవినాష్. దీనిని అఖిల్ కూడా అక్కడే కూర్చొని తెగ ఎంజాయ్ చేశాడు. ఇక రెండు జడలు వేసుకున్న సుజాతను అవినాష్‌ వదల్లేదు. అరియానా, లాస్యతో సహా అందరినీ ఆట పట్టించాడు. ఏది ఏమైనా మొదటి సీజన్‌లో నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాక హౌజ్‌లో ఎంత జోష్ వచ్చిందో.. ఈ సీజన్‌లో అవినాష్ ఎంట్రీ ఇచ్చాక కూడా అంతే జోష్ వచ్చింది.

Read More:

Breaking News : ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌ చేయాలి

రాయల్స్ బోణీ.. చెన్నై ఓటమి..

Loading...
Unable to load recommendations.
Follow Us