రాయల్స్ బోణీ.. చెన్నై ఓటమి..

కరోనా కారణంగా ఐపీఎల్ 2020 ఆలస్యమైనా.. లీగ్‌లోని ప్రతీ మ్యాచ్ బోలెడంత థ్రిల్ కలిగిస్తోంది. ఇవాళ చెన్నై, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా చివరి దాకా రసవత్తరంగా సాగింది. అయితే చివరికి రాజస్థాన్ రాయల్స్ 16 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి బోణీ కొట్టింది. (IPL 2020) ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (32 బంతుల్లో 74; […]

  • Ravi Kiran
  • Publish Date - 11:44 pm, Tue, 22 September 20

కరోనా కారణంగా ఐపీఎల్ 2020 ఆలస్యమైనా.. లీగ్‌లోని ప్రతీ మ్యాచ్ బోలెడంత థ్రిల్ కలిగిస్తోంది. ఇవాళ చెన్నై, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా చివరి దాకా రసవత్తరంగా సాగింది. అయితే చివరికి రాజస్థాన్ రాయల్స్ 16 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి బోణీ కొట్టింది. (IPL 2020)

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (32 బంతుల్లో 74; 1 ఫోర్, 9 సిక్స్‌లు), స్టీవ్ స్మిత్ (47 బంతుల్లో 69; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో మెరిపించారు. లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 20 ఓవర్లకు 6 వికెట్లకు 200 పరుగులు మాత్రమే చేసింది. డుప్లెసిస్ (37 బంతుల్లో 72; 1 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఒక్కడే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. వాట్సన్(33) ఫర్వాలేదనిపించాడు. ఇక చివర్లో ధోని(29) మెరుపులు మెరిపించినా.. టార్గెట్ చేరుకోలేకపోయారు. రాయల్స్ బౌలర్ రాహుల్ ట్వేటియా 3 వికెట్లు తీశాడు. కాగా, మ్యాన్ అఫ్ ది మ్యాచ్ సంజూ శాంసన్ దక్కించుకున్నాడు.