బిగ్ బాస్ ప్రైజ్ మనీతో ఏం చేస్తారు.? రైతుల కోసం డ‌బ్బు ప‌క్క‌న పెడతానన్న అరియానా.. శభాష్ అంటున్న నెటిజన్లు.!

అనుకున్నట్లుగానే జరిగింది. 14వ వారం ఎలిమినేషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ నుంచి గుజరాతీ భామ మోనాల్ గజ్జర్ బయటికి వచ్చేసింది.

  • Updated On - 11:30 am, Mon, 14 December 20
బిగ్ బాస్ ప్రైజ్ మనీతో ఏం చేస్తారు.? రైతుల కోసం డ‌బ్బు ప‌క్క‌న పెడతానన్న అరియానా.. శభాష్ అంటున్న నెటిజన్లు.!

Bigg Boss 4: అనుకున్నట్లుగానే జరిగింది. 14వ వారం ఎలిమినేషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ నుంచి గుజరాతీ భామ మోనాల్ గజ్జర్ బయటికి వచ్చేసింది. అయితే తన పంథాకు కొంచెం భిన్నంగా ఆమె వెళ్లిపోయేటప్పుడు పెద్దగా ఏడవకుండా మిగిలిన కంటెస్టెంట్లకు బెస్ట్ విషెస్ చెబుతూ వీడ్కోలు పలకడం ఆశ్చర్యం కలిగించింది. అంతేకాదు తనకు ఎంతో ఇష్టమైన అఖిల్‌ చేతికి పువ్వు అందించి బరువెక్కిన హృదయంతో బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికి వచ్చింది.

ఇదిలా ఉంటే హోస్ట్ అక్కినేని నాగార్జున బిగ్ బాస్ ప్రైజ్ మనీ రూ. 50 లక్షలని ప్రకటించాడు. ఒకవేళ ట్రోఫీ, ఈ ప్రైజ్ మనీ మీ సొంతమైతే.. ఏం చేస్తారని ప్రతీ కంటెస్టెంట్‌ను ప్రశ్నించాడు. నాకు ఒక్క రూపాయి వద్దని.. అన్నీ అమ్మకే ఇచ్చేస్తానని హారిక చెప్పగా.. తాను గెలిచినా డబ్బు మొత్తాన్ని నాన్న చేతుల్లో పెడతానని అభిజిత్ వివరించాడు.

నాకోసం ఎంతో కష్టపడిన అమ్మ కోసం ఇన్వెస్ట్ చేస్తానని మోనాల్, ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్లకు కొంత డబ్బు.. ఒక ఇల్లు కొనుక్కుని.. చిన్న కేఫ్ పెడతానని అఖిల్ చెప్పుకొచ్చారు. ఇక సోహైల్ మాట్లాడుతూ.. నా అకౌంట్‌లో ఎప్పుడూ లక్ష మించి లేదని.. అవసరం ఉన్నవాళ్లకు రూ. 10 లక్షలు పక్కన పెట్టి.. ఓ ఫ్లాట్ కొంటానని వివరించాడు.

అనంతరం అరియానా.. తనకు ప్రైజ్ మనీగా వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కట్టుకుంటానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా వాళ్ల ఊరిలో పొలం కోసం రూ. 50,000 అప్పు చేసిన ఐదుగురి రైతుల రుణాలను తీర్చేస్తానని తన మంచి మనసును చాటుకుంది. ఇక ఆమె చెప్పిన ఈ సమాధానానికి హౌస్‌మేట్స్‌తో పాటు నాగార్జున కూడా మెచ్చుకున్నారు.

Also Read:

బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజిత్.! రన్నరప్ సోహైల్.. టాప్ 3లో అఖిల్.. చివరి స్థానంతో సరిపెట్టుకున్న అరియానా..!

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇకపై డిజిటల్‌ ఓటరు కార్డు..! ప్రణాళికలు సిద్ధం..

బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి 24×7 ఆర్టీజీఎస్‌ సేవలు.. ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్..