Big Boss Season 4: టామ్ అండ్ జెర్రి వార్ కంటిన్యూ.. అరియానాపై బిగ్‏బాస్‏కు కంప్లైంట్ ఇచ్చిన సోహైల్..

బిగ్‏బాస్ నాలుగో టాస్క్‏లోనూ టామ్ అండ్ జెర్రి వార్ కంటిన్యూ అవుతూ వస్తుంది. అయితే ఇందులో పాట ఆగే సమయానికి ఎవరూ డాన్స్ ఆపకపోవడంతో అరియానా ఆల్రెడీ గోల్డ్ మైక్

Big Boss Season 4: టామ్ అండ్ జెర్రి వార్ కంటిన్యూ.. అరియానాపై బిగ్‏బాస్‏కు కంప్లైంట్ ఇచ్చిన సోహైల్..

Updated on: Dec 12, 2020 | 9:02 AM

బిగ్‏బాస్ నాలుగో టాస్క్‏లోనూ టామ్ అండ్ జెర్రి వార్ కంటిన్యూ అవుతూ వస్తుంది. అయితే ఇందులో పాట ఆగే సమయానికి ఎవరూ డాన్స్ ఆపకపోవడంతో అరియానా ఆల్రెడీ గోల్డ్ మైక్ అందుకుంది కాబట్టి.. వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అఖిల్ ఆమె పేరుని సూచించాడు. అయితే అఖిల్ మాటకు రియాక్ట్ అయినా అరియానా.. నేను దిగుతా కానీ పార్టిసిపేట్ చేస్తా. నాతోపాటు సోహైల్ కూడా గోల్డ్ మైక్ అందుకున్నాడు కాదా అని ఇన్‏డైరెక్ట్‏గా చెప్పింది. ముందు సోహైల్ దిగితే ఆ తర్వాత నేను దిగిపోతా అని చెప్పింది. అయితే ఇందులో అభి టాస్క్ కండిషన్స్‏ మరచిపోయి స్టేజ్ మీద కూర్చోవడంతో టాక్స్ నుంచి తప్పుకున్నాడు.

ఆ తర్వాత రెండవసారి పాట ఆగిపోయినప్పుడు అరియానా దిగుతూ.. తనకు ఇప్పటికే రెండు సార్లు ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేసుకునే ఛాన్స్ వచ్చిందని, మిగతవారికి కూడా రావాలనే స్టేజి దిగుతున్నానని చెప్పి దిగిపోయింది. ఇక మూడవసారి సోహైల్ దిగిపోయాయడు. వెళ్తూ వెళ్తూ సోహైల్.. తనకు డ్యాన్స్ చేయాలని ఉందన, కేవలం హౌస్ మేట్స్ కోసమే కిందికి దిగుతున్నానని.. ఈ వారం నేను చాలా వీక్‏గా ఉన్నానని.. ఎందుకో మీకు తెలుసు అని ఇన్‏డైరెక్ట్‏గా అరియానాతో జరిగిన గొడవను తీసుకువచ్చాడు. అనంతరం వాష్‏రూం వద్దకు వెళ్ళి అరియానాపై బిగ్‏బాస్‏కు కంప్లైంట్ ఇచ్చాడు సోహైల్. ఇప్పటివరకు జరిగిన టాస్క్‏లలో ఇంటి సభ్యుల కోసం త్యాగం చేయమంటే చేయని అరియానా ఇప్పుడు ఎందుకు ఛాన్స్ ఇచ్చిందని తప్పు పట్టాడు.