బిగ్‌బాస్ 3: ఎలిమినేటెడ్ కంటెస్టెంట్‌లకు కొత్త రూల్స్

Bigg Boss 3, బిగ్‌బాస్ 3: ఎలిమినేటెడ్ కంటెస్టెంట్‌లకు కొత్త రూల్స్

బిగ్‌బాస్ 1, 2లతో చూస్తే మూడో సీజన్‌ను కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఇప్పటికే ఓటింగ్ సిస్టమ్‌ను మార్చేశారు. గతంలో గూగుల్ నుంచి చేసే ఓట్లను ఇప్పుడు హాట్‌స్టార్‌లో చేసే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కేవలం పది ఓట్లకు మాత్రమే పరిమితం చేశఆరు. అయితే ఇవవన్నీ కాకుండా కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చారట బిగ్‌బాస్ నిర్వాహకులు.

గత సీజన్లో ఎలిమినేట్ అయినవారు హౌస్‌లో నుంచి రాగానే మీడియాలకు ఇంటర్వ్యూలో ఇచ్చేవారు. కానీ ఈసారి అలా ఇవ్వకూడదట. మొదట ‘స్టార్ మా’కు ఇంటర్వ్యూలు ఇచ్చాక మిగతా ఏ ఛానల్‌కు అయినా ఇవ్వాలని కొత్త రూల్ తీసుకొచ్చారట. దీంతో ఈ విధంగానూ టీఆర్పీని క్యాష్ చేసుకోవాలని భావిస్తుందట బిగ్‌బాస్ టీం. ఇక గత సీజన్లో ఫైనల్ వరకు వచ్చిన కంటెస్టెంట్లలో తనీష్ ఒకరు. చివరివరకు పోరాటం చేసినప్పటికీ.. టైటిల్ గెలవలేకపోయారు. దీంతో ఇప్పుడు బిగ్‌బాస్ టీం అతడికి ఓ ఛాన్స్ ఇవ్వాలని చూస్తోందట. అదేంటంటే హౌస్‌లో నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూలు చేసే ఛాన్స్ తనీష్‌ను వచ్చినట్లు టాక్. మరి ఈ వార్తలో ఎంత నిజముందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *