Breaking News
  • నెల్లూరు: సైదాపురం తహశీల్దార్‌ చంద్రశేఖర్‌ సస్పెన్షన్‌. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో చంద్రశేఖర్‌తో పాటు.. వీఆర్‌వోతో, తహశీల్దార్‌ ఆఫీస్‌ ఉద్యోగిని సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌.
  • టీవీ9కు అవార్డుల పంట. ఎక్సేంజ్‌ ఫర్‌ మీడియా న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అవార్డుల్లో.. టీవీ9కు మూడు అవార్డులు. పుల్వామా దాడి కవరేజ్‌కు బెస్ట్ న్యూస్ కవరేజ్ అవార్డు అందుకున్న.. విజయవాడ బ్యూరో చీఫ్‌ హసీనా. మరో రెండు విభాగాల్లో టీవీ9కు అవార్డులు. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ కార్యక్రమానికి.. సౌత్‌ ఇండియాలోనే బెస్ట్‌ యాంకర్‌గా రజినీకాంత్‌కు అవార్డు. టీవీ9 టాస్క్‌ఫోర్స్‌ బ్లాక్‌మ్యాజిక్‌ కార్యక్రమానికి మరో అవార్డు. అద్రాస్‌పల్లిలోని 'చితిపై మరో చితి' బాణామతి కథనానికి.. బెస్ట్‌ లేట్‌ ప్రైమ్‌టైం షో అవార్డు.
  • కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన కేంద్రం. స్థానికుల ప్రయోజనాలను కాపాడుతామని హామీ. త్వరలో ప్రత్యేక హోదా స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తాం -కేంద్రమంత్రి జితేందర్‌సింగ్‌.
  • రామానాయుడు స్టూడియోలో ప్రెషర్‌ కుక్కర్‌ సినిమా చూసిన కేటీఆర్‌. ప్రెష్‌ ఎనర్జీ, మంచి మెసేజ్‌తో సినిమా ఉంది. డాలర్‌ డ్రీమ్స్‌ కోసం అందరూ అమెరికాకు పరుగులు పెడుతున్నారు. కథలోని కంటెంట్‌ను అందరికీ అర్ధమయ్యేలా సినిమా తీశారు-మంత్రి కేటీఆర్‌.
  • తూ.గో: కోటనందూరు మండలం అప్పలరాజుపేటలో విద్యుత్‌షాక్‌తో మామిడి శ్రీను అనే వ్యక్తి మృతి.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి ఉచిత దర్శనానికి 24 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 56,837 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు.

Bigg Boss 3: అలీ, బాబా భాస్కర్ మధ్య గొడవ.. అసలు విలన్ ఎవరు.?

War Of Words Between Mahesh Vitta And Ali Reza, Bigg Boss 3: అలీ, బాబా భాస్కర్ మధ్య గొడవ.. అసలు విలన్ ఎవరు.?

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3.. నాలుగు వారాలు ముగించుకుని ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం ఎలిమినేషన్స్‌లో రాహుల్ – హిమజ – అషు – మహేష్ – పునర్నవి – శివజ్యోతి – బాబా భాస్కర్‌లు ఉన్నారు. అందులోనూ నామినేషన్ ప్రక్రియలో హౌస్‌మేట్స్ మధ్య పెద్ద వాగ్వాదమే చోటు చేసుకుంది.

ఇది ఇలా ఉండగా హౌస్‌లోనే మంచోడిగా పేరు తెచ్చుకున్న బాబా భాస్కర్‌ను అలీ రెజా నామినేట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. అదీ కాకుండా వాళ్లిద్దరూ మంచి స్నేహితులు కూడా.. కొన్ని టాస్క్‌లలో అలీని బాబా భాస్కర్ సేవ్ చేయడం జరిగింది. ఐదోవారం కెప్టెన్ అయిన అలీ.. డైరెక్ట్ నామినేషన్‌గా బాబా భాస్కర్‌ను ఎంచుకోవడం.. పైగా చెప్పిన కారణాలు కూడా పొంతన లేకుండా ఉన్నాయి.

ఇక తాజాగా స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో ఈ విషయంపై మహేష్ విట్టా.. అలీ వద్ద ప్రస్తావించగా.. ఇద్దరి మధ్య చిన్న గొడవ చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి.. ఈ ఇద్దరి స్నేహితుల మధ్య అసలు విలన్ ఎవరో తెలిసిపోతుంది.

Related Tags