Big News Big Debate: తెలంగాణలో ఆకర్ష్ పాలిటిక్స్.. దూకుడు పెంచిన పార్టీలు.. లైవ్ డిబేట్

|

Jun 24, 2022 | 7:25 PM

కాంగ్రెస్‌లో వరుస చేరికలు కేడర్‌లో జోష్‌ నింపుతున్నాయి. రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న హస్తానికి 2018 ఎన్నికల అనంతరం ఇబ్బందులు తప్పలేదు. ఉనికే ప్రమాదంగా మారింది. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. నేతలు ఇతర పార్టీల్లోకి వలస కట్టారు. కానీ ప్రజంట్ సీన్ మారింది. చ

తెలంగాణలో హ్యాట్రిక్‌ విజయం లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతుంటే.. చెక్‌ పెట్టాలని ప్రతిపక్షాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పోయిన అధికారాన్ని దక్కించుకుని జెండా ఎగరేయాలని కాంగ్రెస్‌ శక్తిని కూడదీసుకుంటోంది. కొత్తగా అధికారం దక్కించుకోవడానికి కమలనాథులు కత్తులు నూరుతున్నారు. బలమైన ప్రత్యర్ధిగా కనిపించడానికి ఇరు పార్టీలు వలసలను కూడా నమ్ముకున్నాయి. అయితే కొంతకాలంగా బీజేపీ ఇందులో వెనకపడినట్టు కనిపిస్తుంటే… కాంగ్రెస్ మాత్రం దూకుడుమీద ఉంది.

 

 

Published on: Jun 24, 2022 07:25 PM