దక్షిణాది భాషల్లోకి మరో బాలీవుడ్‌ హిట్ మూవీ

మరో బాలీవుడ్‌ హిట్ మూవీ దక్షిణాది భాషల్లోకి రీమేక్ అవ్వబోతుంది. ఆయుష్మాన్ ఖురానా, సాన్యా మల్హోత్రా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘బదాయి హో’ను ఇప్పుడు సౌత్‌లో రీమేక్ చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈ మూవీ రీమేక్ రైట్స్‌ను తీసుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను ఆయన తెరకెక్కించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్ర రీమేక్‌కు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియనున్నాయి. #Update: #BadhaaiHo in South Indian languages… Boney […]

దక్షిణాది భాషల్లోకి మరో బాలీవుడ్‌ హిట్ మూవీ
Follow us

| Edited By:

Updated on: Mar 19, 2019 | 3:02 PM

మరో బాలీవుడ్‌ హిట్ మూవీ దక్షిణాది భాషల్లోకి రీమేక్ అవ్వబోతుంది. ఆయుష్మాన్ ఖురానా, సాన్యా మల్హోత్రా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘బదాయి హో’ను ఇప్పుడు సౌత్‌లో రీమేక్ చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈ మూవీ రీమేక్ రైట్స్‌ను తీసుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను ఆయన తెరకెక్కించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్ర రీమేక్‌కు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియనున్నాయి.

అయితే పెళ్లికి సిద్ధంగా హీరో ఉన్న సమయంలో ఆయన తల్లి నెల తప్పుతుంది. ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి అనే కథాంశంతో ‘బదాయి హో’ తెరకెక్కింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్‌ వద్ద 200కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఈ చిత్రాన్ని సౌత్‌లో రీమేక్ చేసేందుకు బోని కపూర్ సిద్ధమయ్యాడు. కాగా కంగనా రనౌత్ హీరోయిన్‌గా వచ్చిన క్వీన్ కూడా దక్షిణాది భాషలన్నింటిలో రీమేక్ అవుతోంది. ఈ మూవీని సంబంధించి అన్ని భాషలలో షూటింగ్ పూర్తైనప్పటికీ, కొన్ని కారణాల వలన ఏ భాషలోనూ ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు.