Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

‘బాహుబలి’ టీమ్ రీ యూనియన్.. మిలియన్ డాలర్ల ఫొటో

తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబలి. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీని ఎవ్వరూ మర్చిపోలేరు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ఇటీవల అరుదైన గౌరవం లభించింది. ఈ మూవీని లండన్‌లో ప్రతిష్టాత్మక ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శించినున్నారు. ఈ ప్రదర్శనకు బాహుబలి టీం హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నిర్మాత శోభు యార్లగడ్డ, ప్రభాస్, అనుష్క, రానాలతో ఓ ఫొటోను తీసుకొన్న రాజమౌళి.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

8మా అందరికీ లండన్‌లో ఇది రాయల్ రీ యూనియన్. బాహుబలి షో కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో బ్యాగ్రౌండ్ స్కోర్‌ ప్లే అవ్వనుంది’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ ప్రదర్శనలో సంగీత దర్శకుడు కీరవాణి లైవ్‌లో నేపథ్య సంగీతాన్ని వినిపించనున్నారు. ఇక ఈ వేదికపై బాహుబలితో పాటు హాలీవుడ్ సినిమాలు హ్యారీ పోటర్, బాండ్ మూవీ స్కై ఫాల్‌లు కూడా ప్రదర్శించనున్నారు. ఇదిలా ఉంటే ఈ ఫొటోకు నెటిజన్లు ‘మిలియన్ డాలర్ల ఫొటో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.