Weekly Horoscope: వార ఫలాలు.. జనవరి 8 నుంచి 14వ తేదీ వరకు..

| Edited By: Rajitha Chanti

Jan 08, 2023 | 7:56 AM

మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహాయానికి ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా నిరుత్సాహం చెందడం జరుగుతుంది

Weekly Horoscope: వార ఫలాలు.. జనవరి 8 నుంచి 14వ తేదీ వరకు..
Horoscope
Follow us on

జనవరి 8 నుంచి 14, 2023 వరకు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎవరికీ అప్పులు ఇవ్వటం కానీ, తీసుకోవటం కానీ చేయవద్దు. ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను గుర్తించి అదనపు బాధ్యతలు అప్పగించడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. మంచి చోట పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారి తీసే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
అదృష్ట యోగం పడుతుంది. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. బందు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి. పిల్లల నుంచి శుభవార్త వింటారు. తోబుట్టువులకు సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
అవసరానికి తగినట్టుగా చేతికి డబ్బు అందుతుంది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. రుణ సమస్య చాలావరకు తగ్గుతుంది. సన్నిహితుల సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా లక్ష్యాలను పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలలో కొన్ని చికాకులు ఎదురవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు కొన్ని వెనక్కి వెళతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయంలో కొద్దిగా పెరుగుదల కనిపిస్తుంది. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాల్సి ఉంటుంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ మాటకు విలువ ఉంటుంది. బంధుమిత్రులు మీ సలహాల మీద ఆధారపడతారు. అదృష్ట యోగం పడుతుంది. ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. ఐటి తదితర నిపుణులు ప్రమోషన్లు అందుకుంటారు. అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను స్వీకరించడం జరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
మీకు బకాయి పడ్డవారితో సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ముఖ్యంగా వైద్య ఖర్చులు ఎక్కువ అవుతాయి. తిప్పట, శ్రమ తప్పవు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. కొత్త ఉద్యోగం ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా అసంతృప్తి కలిగిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఈ వారంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ పరంగా శుభవార్త అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా ముందడుగు వేస్తారు. కొందరు స్నేహితులకు సహాయం చేస్తారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం మానసికంగా ఒత్తిడి చేస్తుంది. ఆర్థిక లావాదేవీలవల్ల ప్రయోజనాలు ఉంటాయి. అనారోగ్యం నుంచి చాలావరకు బయటపడతారు. డబ్బు జాగ్రత్త.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి వ్యాపారాల్లో ఎంతో శ్రమపడి కొద్దిగా లాభాలు సంపాదిస్తారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనికి ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐటీ రంగానికి చెందిన వారికి మంచి ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహాయానికి ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా నిరుత్సాహం చెందడం జరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. మిమ్మల్ని చూసి అసూయపడే వారుంటారు. స్నేహితుల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించండి. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన లక్ష్యాలను శ్రద్ధగా పూర్తి చేస్తారు. ఉద్యోగం మారటానికి ఇది సమయం కాదు. కొన్ని ప్రయత్నాలు బె డిసి కొట్టే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలను గడించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్ర చేస్తారు. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. బంధుమిత్రులకు మంచి సలహాలు ఇస్తారు. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. సన్నిహితులు అండగా నిలబడతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
అనుకోకుండా ఆర్థికంగా కలిసి వస్తుంది. కొన్ని అవసరాలు తీరటానికి అవకాశం ఉంది. సన్నిహితులకు ఉదారంగా సహాయం చేస్తారు. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. వ్యాపారంలో భాగస్వామిగా చేరే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. విపరీతంగా ఒత్తిడి ఉన్నా పట్టుదలగా లక్ష్యాలను పూర్తి చేస్తారు. అనారోగ్యం నుంచి చాలావరకు బయటపడతారు. ఒకటి రెండు శుభవార్తలు మీ చెవిన పడే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా ఉంటాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ పరంగానే కాక, కుటుంబ పరంగా కూడా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు నిలకడగా ఉంటాయి. ఖర్చుల్ని తగ్గించుకుంటారు. బంధుమిత్రుల కారణంగా ఒకటి రెండు చికాకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. సన్నిహితుల ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మీకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు తీసుకువచ్చి ఇస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యసనాల జోలికి పోవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఒక పట్టాన ముందుకు వెళ్లకపోవచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీకు డబ్బు ఇవ్వాల్సిన వారు వాయిదా వేస్తూ ఉంటారు. బంధుమిత్రుల సహాయంతో ఓ ముఖ్యమైన సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటుంది. మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళతాయి. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి