Wealth Astrology: వీరికి రెండు మహా ధన యోగాలు.. సంపన్నులయ్యే రాశులివే..!

Dhana Yoga 2026: నవంబర్ 17, 18, 19 తేదీల్లో చంద్రుడి సంచారం కారణంగా రెండు శక్తివంతమైన ధన యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ చంద్ర మంగళ యోగం, గజకేసరి యోగాల ప్రభావంతో ఆరు రాశుల వారికి అదృష్టం కలిసివచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లోనూ శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఇంతకీ ఆ అదృష్ట రాశులు ఏవి? మీ రాశి కూడా ఉందా?

Wealth Astrology: వీరికి రెండు మహా ధన యోగాలు.. సంపన్నులయ్యే రాశులివే..!
Dhana Yoga 2026

Edited By:

Updated on: Nov 14, 2026 | 4:48 PM

ఈ నెల(నవంబర్) 17, 18, 19 తేదీల్లో చంద్ర సంచారం కారణంగా రెండు మహా ధన యోగాలు కలగబోతు న్నాయి. కొన్ని రాశులవారు ఈ యోగాల వల్ల సంపన్నులు అయ్యే అవకాశం ఉంటుంది. కుంభ రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడికి సప్తమంలో కుజ, గురువులు సంచారం చేస్తున్నందువల్ల చంద్ర మంగళ యోగం, గజకేసరి యోగం ఏర్పడ్డాయి.ఈ ధన ధాన్య సమృద్ధి యోగాలతో మేషం, వృషభం, సింహం, తుల, వృశ్చికం, కుంభ రాశులు నక్క తోకను తొక్కబోతున్నాయి. ఈ యోగాల ప్రభావం వల్ల తక్షణ ఫలితాలతో పాటు, దీర్ఘకాలిక యోగాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి, పెళ్లికి, ఉద్యోగానికి ప్రయత్నాలు చేపట్టడానికి ఇది అనుకూల సమయం.

  1. మేషం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న చంద్రుడితో గజకేసరి యోగం, చంద్ర మంగళయోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారికి ఏ ప్రయత్నమైనా విజయవంతమయ్యే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి.ఒకటికి రెండుసార్లు మహా భాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. ఈ రెండు యోగాల వల్ల లక్ష్మీ కటాక్షం కలిగి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కార మవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల ఊహించని ధన లాభాలు కలుగుతాయి.
  2. వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న చంద్రుడిని గురు, కుజుల చూడడం వల్ల వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. అనేక విధాలుగా ధన లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులే షన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు అంచనాల్ని మించి లాభిస్తాయి. ఆస్తి లాభం, భూ లాభం కలుగు తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందడం వంటివి తప్ప కుండా జరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సంతాన యోగానికి అవకాశముంది.
  3. సింహం: ఈ రాశిలో ఉన్న గురు, కుజులు సప్తమంలో ఉన్న చంద్రుడిని వీక్షించడం వల్ల ఈ రాశివారికి దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి ఏ చిన్న ప్రయత్నం చేపట్టినా విజయ వంతం అవుతుంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని దాటుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగు తుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. విదేశీ సంపాదన యోగం కూడా పడుతుంది.
  4. తుల: ఈ రాశికి లాభ స్థానంలో గజకేసరి, చంద్ర మంగళ యోగాలు పడుతున్నందువల్ల అనేక కీలక విషయాల్లో ఈ రాశివారి అదృష్టానికి తిరుగుండదు. ఆర్థికపరంగా దశ తిరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాలు కలగడానికి అవకాశం ఉంది. స్వల్ప ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యో గులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. వృశ్చికం: ఈ రాశికి ఈ రెండు మహా భాగ్య యోగాలు చతుర్థ, దశమ స్థానాల్లో ఏర్పడడం వల్ల అనేక మార్గా లలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా ఆదాయం పెరుగుతుంది. రావలసిన సొమ్మును, బాకీలను, బకాయిలను రాబట్టుకుంటారు. సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది. తల్లితండ్రుల వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగంలో జీత భత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది.
  7. కుంభం: ఈ రాశిలో ఉన్న చంద్రుడిని సప్తమ స్థానం నుంచి గురు, కుజులు వీక్షించడం వల్ల రెండు ధన యోగాలు ఏర్పడి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి లాభానికి, భూ లాభానికి బాగా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో సొంత ఇంటి కల నెరవేరుతుంది. తండ్రి వైపు నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వాపారాల్లో రాబడి పెరుగుతాయి. మదుపులు, పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి.
Loading...
Unable to load recommendations.
Follow Us