
దిన ఫలాలు (నవంబర్ 9, 2026): మేషం రాశి వారికి రోజంతా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృషభం రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. మిథునం రాశి వారికి ఉద్యోగులు సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అదనపు ఆదాయ మార్గాల మీద దృష్టి పెడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
రోజంతా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే సూచన లున్నాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఆర్థిక పరిస్థితి చక్క బడుతుంది. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయాలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యో గాల్లో పదోన్నతికి అవకాశముంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగుతాయి. మంచి ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యక్తిగత పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో చిన్నపాటి సమస్యలున్నా వాటిని అధిగమిస్తారు.
ఉద్యోగులు సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అదనపు ఆదాయ మార్గాల మీద దృష్టి పెడతారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. తమకు అందిన అవకాశాల్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
ఉద్యోగంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభ కార్యం నిర్వహించడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. ఆశించిన ఆర్థిన వనరులు సమకూరుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మాటకు విలువ పెరుగుతుంది. వృథా ఖర్చులు బాగా తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో కార్యసిద్ధికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయి కొద్దిగా ఊరట చెందుతారు. శత్రువుల లేదా ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందజేస్తారు. తోబుట్టువుల నుంచి శుభ వార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఉద్యోగంలో అనుకూలతలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో కాల క్షేపం చేస్తారు. కుటుంబపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, ఆదాయానికి లోటుండదు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయ వంతంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. దగ్గర బంధువుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది.
వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోభివృద్ధి కలుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంపొం దుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు అందుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఒక ప్రధానమైన రుణ సమస్య నుంచి బయట పడతారు. బరువు, బాధ్యతలు బాగా తగ్గుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఉద్యోగ జీవితంలో మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన రాబడి ఉంటుంది. మీ సలహాలు, సూచనలను అధికారులు పాటించి ప్రయోజనం పొందుతారు. ప్రయాణాల విష యంలో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కాస్తంత ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. బంధుమిత్రుల వల్ల ప్రయోజనం పొందుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. కొన్ని ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికంగా సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆర్థికంగా పైచేయిగా ఉంటారు. మధ్య మధ్య కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు అందివస్తాయి. కుటుంబంతో దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు.