సోంపు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!

samatha

8 November 2026

Pic credit - Pinterest

సోంపు ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది వీటిని ఎక్కువగా తింటుంటారు.  ఇప్పుడు మనం సోంపు తినడం వలన కలిగే లాభాలు ఏవో చూద్దాం.

సోంపు

చాలా మంది బిర్యానీ లాంటివి తిన్న తర్వాత సోంపు తింటారు. ఇక కొంత మంది అసలు సోంపు తినడానికే ఆసక్తి చూపరు.

బిర్యానీ తిన్న తర్వాత

కానీ ప్రతి రోజూ  కొన్ని సోంపు గింజలు నమలడం వలన ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో చూద్దాం.

సోంపు గింజలు

సోంపు గింజలు జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ వీటిని భోజనం చేసిన తర్వాత తినడం వలన జీర్ణక్రియ మెరుగు పడుతుంది.

జీర్ణక్రియ ఆరోగ్యం

అంతే కాకుండా, ఎవరు అయితే గ్యాస్, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్నారో, వారికి సోంపు చాలా మంచిది.

గ్యాస్, అజీర్తి

ప్రతి రోజూ సోంపు తినడం వలన ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. పేగు కదలికలను పెంచి మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

మలబద్ధకం

అంతే కాకుండా నోటి దుర్వాసనతో బాధపడే వారు కూడా వీటిని తినడం మంచిది. ఇది నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.

నోటి దుర్వాసన

అలాగే శరీరంలో అధిక వేడితో బాధపడే వారు సోంపు తినడం వలన ఇది శరీరంలో వేడిని తగ్గించి, చలువ చేస్తుంది.

అధిక వేడి