
దిన ఫలాలు (నవంబర్ 21, 2026): మేష రాశి వారు ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పిల్లలు చదువుల్లో ముందడుగు వేస్తారు. వృషభ రాశి వారికి ఆర్థికంగా బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభకు ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడి బాగా అనుకూలంగా ఉంటుంది. బంధువులకు ఆర్థికంగా సహాయ చేస్తారు. రాబడి మీదా, ఆదాయాన్ని పెంచుకోవడం మీదా దృష్టి పెడతారు. కుటుంబ సభ్యుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయానికి లోటుండదు. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పిల్లలు చదువుల్లో ముందడుగు వేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం వృద్ధి చెందుతాయి. ఆర్థికంగా బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆదాయ వృద్ధికి సంబంధించి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. అనేక విధాలుగా ఆదాయ వృద్ధికి అవకాశముంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి చాలావరకు తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు అందుతాయి. పెద్దల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. కుటుంబ పరిస్థితులు సామరస్యంగా మారతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు కానీ, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు పని భారం పెంచే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. అనుకున్న సమయానికి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.
శుభ కార్యంలో కొందరు ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులకు సహా యం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల్ని పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. ప్రము ఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వాహన యోగం పడు తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది.
ఉద్యోగంలో అదనపు బాధ్యతల్ని నిర్వర్తించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఇష్టమైన బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలకు అవకాశాలు లభిస్తాయి. కుటుంబ పరిస్థితులు బాగా ఒత్తిడి కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆశించిన శుభవార్తలు అందే అవకాశముంది.
ఉద్యోగం సాఫీగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి ఏమాత్రం లోటుండదు. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. అనుకోకుండా కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలపడతాయి. ఇతరుల వ్యవ హారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టం జరుగుతుంది.
ఉద్యోగంలో అధికారులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం తగ్గు ముఖం పడుతుంది. వ్యాపారాల్లో శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవ హారాలు నిదానంగా పూర్తవుతాయి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. భారీగా వస్త్రాభ రణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల వల్ల ప్రయోజనం పొందుతారు. కుటుంబ పరిస్థితులు ఇబ్బంది కలిగిస్తాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాల్ని పొందుతారు. కొద్దిపాటి మార్పులతో వ్యాపారాలను లాభాల బాటపట్టిస్తారు. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం ఇది. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తారు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు.
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి. కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడతారు. ఇతరులకు మేలు చేకూర్చే పనులు చేస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదాపడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపో వడం మంచిది. కొన్ని ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయ వృద్ధికి సమయం అనుకూలంగా ఉంది. కొన్ని కుటుంబ సంబంధమైన చికాకులు, ఇబ్బందులు ఉంటాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. హోదా పెరగడానికి అవకాశముంది. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుం బంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. శుభవార్తలు వింటారు. మంచి పరిచయాలు కలుగుతాయి.