Success Astrology: నాలుగు గ్రహాల కటాక్షం.. అక్టోబర్ లోగా వీరు విజేతలు కాబోతున్నారు..!

Telugu Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం మేషం, వృషభం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారు పట్టుదల, లక్ష్యసాధనలో వెనుకడుగు వేయని వ్యక్తులుగా భావిస్తారు. జూన్ 20 నుంచి అక్టోబర్ 31 వరకు శని, గురు, రాహు, కేతువుల అనుకూల సంచారం కారణంగా ఈ రాశుల వారికి కొత్త అవకాశాలు, విజయాలు, లక్ష్యసాధనకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Success Astrology: నాలుగు గ్రహాల కటాక్షం.. అక్టోబర్ లోగా వీరు విజేతలు కాబోతున్నారు..!
Success Astrology

Edited By:

Updated on: Jun 19, 2026 | 4:30 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం మేషం, వృషభం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారు ‘పట్టు వదలని విక్రమార్కులు.’ ఈ రాశుల వారు ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా దాన్ని సాధించనిదే విడిచిపెట్టరు. వీరిలో పట్టుదల, తెగింపు కాస్తంత ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం ఈ రాశులకు శని, గురువు, రాహువు, కేతువులు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల వీరు ఈ నెల(జూన్) 20 నుంచి అక్టోబర్ 31 వరకు కొత్త లక్ష్యాలు, ఆశయాలతో దూసుకుపోయే అవకాశం ఉంది. వీరు తత్వాన్ని బట్టి వీరు తప్పకుండా విజేతలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మేషం

సహజ నాయకత్వ లక్షణాలు, విపరీతమైన పట్టుదల, దూరదృష్టి, నిర్ణయాత్మక శక్తికి మారుపేరైన ఈ రాశివారు ఉన్నత పదవులు అలంకరించడం, ఒక సంస్థకు అధిపతి కావడం వంటి లక్ష్యాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలన్న తపన కూడా ఉంటుంది. వీరికి ప్రస్తుతం శని, గురు, రాహువులతో పాటు కుజుడు కూడా బాగా అనుకున్నందువల్ల నాలుగు నెలల్లో తమ లక్ష్యాలను సాధించుకునే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాల్లో బాగా వృద్ధిలోకి వస్తారు.

వృషభం

ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంలో, పట్టుదలలో అగ్ర స్థానంలో ఉండే ఈ రాశివారికి ప్రస్తుతం శని, రాహువు, శుక్రుడు, రవి, కుజుల అనుకూలత కారణంగా ఆదాయ వృద్ధి మీద, సంపన్నులు కావడం మీద ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల్ని పరిష్కరించు కుంటారు. కుటుంబ జీవితాన్ని మెరుగుపరచుకుంటారు. విలాసవంతంగా జీవిస్తారు. ఆస్తిపాస్తుల్ని పెంచుకుంటారు. ఎంత శ్రమకైనా ఓర్చుకుని తమ లక్ష్యాలను సాధించుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

సింహం

నాయకత్వ లక్షణాలు, అందరినీ కలుపుకునిపోయే తత్వంతో పాటు, అధికార దాహం కలిగిన ఈ రాశివారిలో ఒక సంస్థకు అధిపతి కావడం, ఒక సంస్థను ఏర్పాటు చేయడం, ఆదాయాన్ని పెంచు కోవడం వంటి అంశాలను లక్ష్యంగా తీసుకునే అవకాశం ఉంది. ఈ రాశివారికి గురు, రాహువులతో పాటు రాశ్యధిపతి రవి, కుజుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ దిశగా పురోగతి చెందడం, అనుకున్నది సాధించడం జరుగుతుంది. ఆదాయాన్ని బాగా వృద్ధి చేసుకోవడం జరుగుతుంది.

వృశ్చికం

విపరీతమైన పట్టుదల, మొండితనాలతో పాటు సాహసం, తెగువ, చొరవ, ధైర్యం పుష్కలంగా ఉండే ఈ రాశివారు ఈ ఏడాది ఆస్తిపాస్తులను కూడగట్టుకోవడం, ఆస్తి సమస్యలను సానుకూలంగా పరి ష్కరించుకోవడం, సొంత ఇంటిని అమర్చుకోవడం మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. గురువుతో పాటు రవి, కుజులు అనుకూలంగా ఉన్నందువల్ల వీరు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి, వ్యూహాలను రూపొందించి, మరో నాలుగు నెలల్లో తప్పకుండా తిరుగులేని విజేతలయ్యే అవకాశం ఉంది.

ధనుస్సు

ఇతరుల కంటే అగ్రస్థానంలో ఉండాలనే తపన ఎక్కువగా ఉండే ఈ రాశివారు తమ లక్ష్యానికి తగ్గ ట్టుగా విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవడం, సంపన్నులు కావడం, నైపుణ్యాలను పెంచుకోవడం వంటిని సాధించే అవకాశం ఉంది. స్వదేశంలో ఉండే పక్షంలో ఒక సంస్థకు అధిపతి అయ్యే అవ కాశం కూడా ఉంది. గురు, రాహువులతో పాటు బుధ, కుజుల అనుకూలత వల్ల అక్టోబర్ లోగా చివరిలోగా అనుకున్నది సాధించడానికి, ఉన్నత స్థితికి చేరుకోవడానికి బాగా అవకాశం ఉంది.

మకరం

జ్యోతిషశాస్త్రంలో ‘పట్టువదలని విక్రమార్కులు’గా గుర్తింపు పొందిన ఈ రాశివారు ఆదాయవృద్ది కోసం, ఇంటా బయటా గుర్తింపు కోసం, ఒక ప్రముఖుడుగా ఎదగడం కోసం తాపత్రయపడే అవకాశం ఉంది. వీరికి ప్రస్తుతం గురు, శనులతో పాటు కుజ, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల కొద్ది ప్రయత్నంతో తమ లక్ష్యాలను సాధించుకోవడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందడం, వీరికి సరైన గుర్తింపు లభించడం నవంబర్ లోగా జరిగే అవకాశం ఉంది.

Also Read: ఆ రాశుల వారికి అదృష్టమే అదృష్టం..! ఇందులో మీ రాశి ఉందా?

Follow Us