Telugu News Astrology These zodiac signs likely to see major progress before October 31 details in Telugu
ఆశలు నెరవేరే గోల్డెన్ టైమ్..! అక్టోబర్‌లోపు వారి జీవితంలో ఊహించని మార్పులు
Telugu Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం లాభ స్థానం బలంగా ఉండటం వల్ల ఆదాయం, ఉద్యోగ పురోగతి, పదోన్నతులు, పలుకుబడి, కోరికల నెరవేర్పు వంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రస్తుత గ్రహ సంచారం ప్రభావంతో అక్టోబర్ 31లోపు మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మకర రాశుల వారికి కెరీర్, ఆర్థిక రంగాల్లో విశేష పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జ్యోతిషశాస్త్రం ప్రకారం లాభ స్థానం పురోగతిని సూచిస్తుంది. లాభ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి జాతకుల పురోగతికి దిశా నిర్దేశం జరుగుతుంది. ఆదాయ వృద్ధి, పదోన్నతులు, ప్రముఖులతో పరిచయాలు, పలుకుబడి వంటివి లాభ స్థానం, అంటే 11వ స్థానం కిందకే వస్తాయి. ఈ స్థానం ఎంత బలంగా ఉంటే అంత మంచిది. ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మకర రాశుల వారు ఈ ఏడాది అక్టోబర్ 31 లోపల బాగా పురోగతి చెందే అవకాశం ఉంది. వీరి మనసులోని కోరికలు, ఆశలు, ఆశయాలు చాలావరకు నెరవేరుతాయి.
మేషం: ఈ రాశికి లాభ స్థానంలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారికి శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ప్రస్తుతం రాహువు తన సొంత నక్షత్రమైన శతభిషంలో సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో స్థిరమైన పురోగతి చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. అంచనాలకు మించిన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది.. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏడాది పాటు వీరికి నిలకడైన పురోగతి ఉంటుంది. పదోన్నతులు కలుగుతాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు త్వరలో తప్పకుండా ఉద్యోగ యోగం పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వ్యాపార, ఆస్తి ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.
కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు ఆగస్టు 2 వరకు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఉద్యోగపరంగానే కాక, ఆదాయపరంగా కూడా శీఘ్ర పురోగతికి, స్థిరమైన పురోగతికి అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు కనకవర్షం కురిపిస్తాయి.
సింహం: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి రవి జూలై 16 వరకు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి జీవితంలో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. ప్రభుత్వమూలక ధన లాభం, ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి.
కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం వల్ల కుటుంబంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఏ రంగానికి చెందిన వారైనా పురోగతి చెందుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు తప్ప కుండా జరుగుతాయి. ఆస్తి వివాదం, కోర్టు కేసులు వంటివి సానుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుతారు. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి.
మకరం: ఈ రాశికి 11వ స్థానమైన వృశ్చిక రాశిని ఆ రాశికి అధిపతి అయిన కుజుడితో పాటు గురువు కూడా ఉచ్ఛ స్థితిలో వీక్షించడం వల్ల లాభ స్థానం బాగా బలపడింది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభించడంతో పాటు పదోన్నతులు కూడా లభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.