Telugu News Astrology Sun Enters Pisces on March 14: Aries, Leo, Virgo, Libra, Pisces May Face Difficulties – Chant Aditya Hridayam for Relief
Sun Transit 2026: ఆస్తి, ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త..! మీన రవితో ప్రతికూలతలు..
మార్చి 14న రవి మీన రాశిలో ప్రవేశించి, నెల రోజుల పాటు అక్కడ సంచారం చేయనుంది. ఈ సంచారం మేషం, సింహం, కన్య, తుల, మీన రాశుల వారికి కొంత ప్రతికూల ప్రభావం ఉండే సూచనలు ఉన్నాయి. ఆస్తి నష్టానికి, ధన నష్టానికి, నమ్మకద్రోహానికి అవకాశం ఉంది. అపనిందలు, విమర్శలు, అవమానాలకు గురయ్యే సూచనలున్నాయి.
ఈ సమయంలో ఆదిత్య హృదయం పఠించడం వల్ల రవి దుష్ఫలితాలు తగ్గే అవకాశం ఉంటుంది.
ఈ నెల (మార్చి) 14న మీన రాశిలో నెల రోజుల పాటు సంచారం చేయబోతున్న రవి గ్రహం వల్ల కొన్ని రాశుల వారు కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ రాశుల వారు ఈ నెల రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం ఆదిత్య హృదయం పఠించడం వల్ల రవి దుష్ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మేషం, సింహం, కన్య, తుల, మీన రాశుల వారు కొద్ది రోజుల పాటు జాగ్రత్తగా ఉండడం మంచిది. తండ్రితో, అధికారులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆస్తి నష్టానికి, ధన నష్టానికి, నమ్మకద్రోహానికి కూడా అవకాశం ఉంది. అపనిందలు, విమర్శలు, అవమానాలకు గురయ్యే సూచనలున్నాయి.
మేషం: వ్యయ స్థానంలో రవి సంచారం వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా తగ్గే అవకాశం ఉంది. బంధుమిత్రుల్లో అవమానాలకు గురయ్యే సూచనలు ఉన్నాయి. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగంలో పొరపాట్టు జరగడానికి, అధికారుల ఆగ్రహానికి గురి కావడానికి అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. కొద్దిగా అనారోగ్యాలు పీడించడం జరుగుతుంది. కొందరు బంధువులు దుష్ప్రచారం సాగించే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి.
సింహం: రాశినాథుడు రవి అష్టమ స్థానంలో సంచారం చేయడం, పైగా తనకు బద్ధ శత్రువైన శనితో కలవడం వల్ల బాగా సన్నిహితులు దూరమవుతారు. మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొందరు బంధుమిత్రులు ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది.
కన్య: ఈ రాశికి అత్యంత పాప గ్రహమైన రవి సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల జీవిత భాగ స్వామి అనారోగ్యంతో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ రాశివారు ఉద్యోగంలో ప్రాభవం కోల్పోవడంతో పాటు, అవమానాలపాలయ్యే సూచనలున్నాయి. ఆరోగ్యం మీద కన్ను వేసి ఉండడం మంచిది. ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఈ నెల రోజుల కాలంలో ఎటువంటి ఒప్పందాల మీదా సంతకాలు చేయకపోవడం మంచిది. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది.
తుల: ఈ రాశికి లాభాధిపతి అయిన రవి షష్ట స్థానంలో సంచారం చేయడం వల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సహాయాలకు, ఉచిత సహాయాలకు, దాన ధర్మాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాదు. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా తగ్గే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధించకపోవచ్చు. తండ్రి వైపు వారితో శత్రుత్వం ఏర్పడడానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు బాగా ఇబ్బంది పెడతాయి.
మీనం: ఈ రాశికి షష్ట స్థానాధిపతిగా అత్యంత పాపగ్రహమైన రవి ఈ రాశిలో సంచారం చేయడం వల్ల అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత, రుణ సమస్యలు పెరిగే సూచనలున్నాయి. అకారణ శత్రుత్వాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. తండ్రి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభించకపోవచ్చు. ప్రయాణాలతో ఇబ్బందులు పడ తారు. మీ రహస్యాలు, వ్యక్తిగత విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఆదాయం తగ్గుతుంది.