Solar Eclipse 2024: ఏప్రిల్ 8న మొదటి సూర్య గ్రహణం.. ఈ 4 రాశులకు చెందిన వ్యక్తులకు డబ్బే డబ్బు..

|

Mar 31, 2024 | 7:42 AM

ఈ గ్రహణ ప్రభావం మనపై ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయినప్పటికీ గ్రహణ సూతకాలం , గ్రహణ ప్రభావం ఉండనున్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8 వ తేదీన ఏర్పడనున్న మొదటి సూర్య గ్రహణ ప్రభావం వలన కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు శుభాలను ఆదుకుంటారని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం వలన ఎవరి జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటాడో.. వారి జీవితంలో ఊహించని లాభాలను అందుకుంటారని.. ఆర్ధిక ప్రయోజనాలు కూడా భారీగా పొందుతారని చెబుతున్నారు. అంతేకాదు ఎటువంటి పనులు మొదలు పెట్టినా సరే సక్సెస్ ను సొంతం చేసుకుంటారు

Solar Eclipse 2024: ఏప్రిల్ 8న మొదటి సూర్య గ్రహణం.. ఈ 4 రాశులకు చెందిన వ్యక్తులకు డబ్బే డబ్బు..
Surya Grahan 2024
Follow us on

హిందూ సనాతన ధర్మంలో గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. సూర్య, చంద్ర గ్రహణాలు కారణంగా మానవ జీవితంలో శుభ, అశుభాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. ఈ ఏడాది మొదటి చంద్ర గ్రహణం ఇప్పటికే ఏర్పడగా.. ఏప్రిల్ లో మొదటి సూర్య గ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సూర్య గ్రహణం కూడా భారత దేశంలో కనిపించదు. దీంతో ఈ గ్రహణ ప్రభావం మనపై ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయినప్పటికీ గ్రహణ సూతకాలం , గ్రహణ ప్రభావం ఉండనున్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8 వ తేదీన ఏర్పడనున్న మొదటి సూర్య గ్రహణ ప్రభావం వలన కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు శుభాలను ఆదుకుంటారని చెబుతున్నారు.

ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం వలన ఎవరి జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటాడో.. వారి జీవితంలో ఊహించని లాభాలను అందుకుంటారని.. ఆర్ధిక ప్రయోజనాలు కూడా భారీగా పొందుతారని చెబుతున్నారు. అంతేకాదు ఎటువంటి పనులు మొదలు పెట్టినా సరే సక్సెస్ ను సొంతం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ సూర్య గ్రహణం వలన ఏ రాశులకు శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం..

వృషభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు సూర్యగ్రహణం శుభ ఫలితాలను తెస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు గుడ్ న్యూస్ వింటారు. మంచి జాబ్ ఆఫర్ ను అందుకుంటారు.  పోటీ పరీక్షలకు రెడీ అవుతున్న స్టూడెంట్స్ కాలం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దంపతులు ఎక్కువ సమయం ఒకరితోనొకరు గడుపుతారు. వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఇవి కూడా చదవండి

మిథున రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులపై కూడా ఈ సూర్యగ్రహణం శుభాలను అందిస్తుంది. అనేక రకాలుగా ప్రయోజనాలు అందుకుంటారు. ఆదాయం పలు విధాలుగా లభిస్తుంది. ఉద్యోగస్తులు సంతోషకరమైన వార్త వింటారు. ఆకస్మికంగా డబ్బులు కలిసి వస్తాయి. తల్లి దండ్రుల నుంచి వారసత్వంగా ఆస్థి కలిసి వచ్చే అవకాశం ఉంది.

సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు కూడా ఈ సూర్యగ్రహణం శుభాలను తెస్తుంది. ఉద్యోగ, వ్యాపారస్తులకు అన్ని విధాలా కలిసి వచ్చి ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు సంతోష పడే వార్త వింటారు. ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్థుల  సహకారంతో ప్రమోషన్స్ అందుకునే అవకాశం ఉంది.

కన్యా రాశి: ఈ రాశికి వ్యక్తులకు కూడా సూర్య గ్రహణం ఉహిచని లాభాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల సపోర్ట్ లభించి కెరీర్ లో ముందుకు అడుగు వేస్తారు. ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అన్ని విధాలా లాభదాయకముగా ఉంటుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు