Luxury Life Horoscope: అనుకూలంగా రెండు కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి విలాస జీవితం..!

| Edited By: Janardhan Veluru

Jan 02, 2024 | 6:21 PM

ఆరు రాశులకు ఇప్పటి నుంచి మూడు నెలల పాటు శుక్ర, కుజుల పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారు విలాస జీవితంలో మునిగి తేలే అవకాశం ఉంది. విలాసా లంటే వ్యసనాలు, విహార యాత్రలు, వినోద యాత్రలు, మంచి హోటళ్లలో భోజనాలు, విందులు వగైరాలు కూడా కావచ్చు. ఈ ఆరు రాశులుః మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీనం.

Luxury Life Horoscope: అనుకూలంగా రెండు కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి విలాస జీవితం..!
Zodiac Signs
Follow us on

ఆరు రాశులకు ఇప్పటి నుంచి మూడు నెలల పాటు శుక్ర, కుజుల పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారు విలాస జీవితంలో మునిగి తేలే అవకాశం ఉంది. విలాసా లంటే వ్యసనాలు, విహార యాత్రలు, వినోద యాత్రలు, మంచి హోటళ్లలో భోజనాలు, విందులు వగైరాలు కూడా కావచ్చు. ఈ ఆరు రాశులుః మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీనం. ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్న శుక్రుడు, ధనూ రాశిలో సంచరిస్తున్న కుజుడు మూడు నెలల పాటు అనుకూల రాశుల్లో సంచరించే అవకాశం ఉంది. ఈ ఫలితాలను వ్యక్తిగత జాతకం చక్రం ఆధారంగా నిర్ధారించాల్సి ఉంటుంది.

  1. మేషం: ఈ రాశికి బాగా అనుకూలంగా ఉండబోతున్న శుక్ర, కుజుల వల్ల ఈ రాశివారికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరగడంతో, విలాసాల మీద కూడా వ్యామోహం పెరుగుతుంది. ఫలితంగా వ్యసనాలకు అలవాటు పడడం గానీ, సంపన్న జీవితాన్ని అనుభవించడం గానీ జరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడి స్నేహితుల సంఖ్య కూడా విస్తరించే అవకాశం ఉంది. వీరి రుచులు, అభిరుచుల్లో బాగా మార్పు వస్తుంది. జల్సాల మీద బాగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది.
  2. కర్కాటకం: ఈ రాశికి సుఖ స్థానాధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతం వృశ్చిక రాశిలోనూ, ఆ తర్వాత ధనుస్సు, మకర రాశుల్లో సంచారం చేయడం వల్ల ఈ రాశివారి జీవన శైలిలో బాగా మార్పు వస్తుంది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడే అవకాశం ఉంటుంది. ఎక్కువగా విందులు, వినోదాల్లో మునిగి తేలడం జరుగుతుంది. వ్యసనాలకు లేదా దురలవాట్లకు అలవాటు పడే సూచనలున్నాయి. ఎక్కువగా విహార యాత్రలు చేయడానికి, స్త్రీలోలత్వానికి కూడా అవకాశం ఉంది.
  3. తుల: సహజంగానే ఎక్కువగా విలాసాలలో గడిపే ఈ రాశివారు శుక్ర, కుజుల అనుకూల సంచారంతో ఇటువంటి జీవితం మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం, ఎక్కువగా ఖర్చు చేయడం జరిగే అవ కాశం ఉంది. ఈ రాశినాధుడు శుక్రుడే అయినందువల్ల, ఈ శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నందువల్ల స్త్రీ సంబంధమైన వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉంటుంది. అనవసర పరిచయాలు పెరుగుతాయి. విహార యాత్రలు పెరుగుతాయి. మొత్తం మీద జీవన శైలి మారిపోతుంది.
  4. వృశ్చికం: ఈ రాశినాథుడైన కుజుడు మిత్ర, ఉచ్ఛ క్షేత్రాల్లో సంచారం చేయబోతున్నందువల్ల వీలైనంతగా జీవితాన్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. సాధారణంగా ఈ రాశివారు విందులు, విహార యాత్రలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుంది. అనవసర పరిచయాలకు కూడా అవకాశం ఉండవచ్చు. తప్పకుండా జీవనశైలి మారిపోవడం, అభిరుచుల్లో మార్పు రావడం జరుగుతుంది. వ్యసనాలు అలవడడానికి అవకాశం ఉంది. విలాస జీవితంలో కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది.
  5. మకరం: ఈ రాశివారికి కుజ, శుక్రులు బాగా అనుకూలంగా మారడంతో పాటు, ధనస్థానాధిపతి కూడా బలంగా ఉన్నందువల్ల విలాస జీవితం మీద ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విందులు, వినోదాలు, విహార యాత్రల మీద ఎక్కువ సమయం వెచ్చించడం జరుగుతుంది. స్నేహితుల సంఖ్య బాగా పెరుగుతుంది. స్నేహితుల మీద ఖర్చు చేయడం కూడా పెరుగుతుంది. సంపన్న జీవితానికి తగ్గట్టుగా విలాసాలకు అలవాటు పడే అవకాశం ఎక్కువగా ఉంది.
  6. మీనం: ఈ రాశివారికి భాగ్య, దశమ, లాభ స్థానాల్లో కుజ, శుక్రుల సంచారం వల్ల తప్పకుండా జీవనశైలిలో మార్పు వస్తుంది. వేషభాషల్లో మార్పు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక పరి స్థితి మెరుగుపడుతుండడంతో అభిరుచుల్లో మార్పు రావడం జరుగుతుంది. సాధారణంగా వినోద యాత్రలకు, దూర ప్రాంత పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వ్యసనాలకు కూడా అలవాటు పడే అవకాశం ఉంటుంది. కొత్త రకం స్నేహాలు, పరిచయాలు పెంపొందే సూచనలున్నాయి.