Shani Jayanti 2023: ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు వచ్చింది, శని దోష నివారణకు చేయాల్సిన చర్యలు ఏమిటంటే

శనీశ్వర జయంతి రోజున.. అత్యంత భక్తి శ్రద్దలతో  ఆచార వ్యవహారాలతో పూజించే భక్తులకు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాదు ఎవరి జాతకంలో శనికి సంబంధించిన ఏదైనా దోషం ఉంటే.. శని జయంతి రోజున శనీశ్వరుడుని పూజించండి.

Shani Jayanti 2023: ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు వచ్చింది, శని దోష నివారణకు చేయాల్సిన చర్యలు ఏమిటంటే
Representative Image
Image Credit source: TV9 Telugu

Updated on: May 11, 2023 | 9:34 AM

శని జయంతిని శని అమావాస్య అని కూడా అంటారు. హిందూ మత విశ్వాసం ప్రకారం.. శనీశ్వరుడు పుట్టిన రోజుని శని జయంతిగా జరుపుకుంటారు. చాలా మంది జీవితాలపై శనీశ్వరుడు ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ధార్మిక దృక్కోణంలో శనీశ్వర జయంతి రోజున.. అత్యంత భక్తి శ్రద్దలతో  ఆచార వ్యవహారాలతో పూజించే భక్తులకు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాదు ఎవరి జాతకంలో శనికి సంబంధించిన ఏదైనా దోషం ఉంటే.. శని జయంతి రోజున శనీశ్వరుడుని పూజించండి. ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు వస్తుంది .. శనీశ్వరుడుకి సంబంధించిన కొన్ని సులువైన పరిహారాల గురించి  తెలుసుకుందాం.

శనీశ్వరుడు జయంతి ఏ తేదీన వస్తుందంటే.. 
పంచాంగం ప్రకారం శని జయంతి శుక్రవారం, 19 మే 2023న వచ్చింది. అయితే, అమావాస్య తిథి మే 18 రాత్రి 09.42 నుండి ప్రారంభమవుతుంది.. మర్నాడు అంటే మే 19 రాత్రి 09.22 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం మే 19న  శనీశ్వర జయంతిని జరుపుకోవాలి. ఈ రోజున శనీశ్వరుడు తన సొంతం రాశి కుంభంలో ఉంటాడు. కనుక శనీశ్వరుడు జయంతి రోజున శని దేవుడిని ఆరాధించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

శనికి సంబంధించిన పరిహారాలు:

ఇవి కూడా చదవండి
  1. శనీశ్వరుడు పూజిస్తూ మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వలన శనీశ్వరుడు అశుభ ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుందని నమ్మకం. పూజ సమయంలో “ఓం శం శనైశ్చరాయ నమః”. మంత్రాన్ని జపించండి. కనీసం 108 సార్లు జపించండి.
  2. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీలమణి శని గ్రహంతో సంబంధం కలిగి ఉంది. శనీశ్వరుడు చెడు ప్రభావాలను నివారించడానికి చాలా ప్రభావవంతంగా ఉంటుందని నమ్ముతారు.అయితే ఏదైనా రత్నాన్ని ధరించే ముందు పరిజ్ఞానం ఉన్న జ్యోతిష్కులను సంప్రదించాల్సి ఉంది.
  3. హిందూ మత విశ్వాసాల ప్రకారం శనీశ్వరుడుని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలి. అంతేకాదు శని దేవుడిని పూజించే సమయంలో నల్ల నువ్వులు, నీలం పువ్వులు, నలుపు బట్టలు సమర్పించండి.
  4. శని జయంతి రోజున శని చాలీసా పఠించడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శని భగవానుడు దీనితో సంతోషిస్తాడు.. తనను పూజించే భక్తుడిపై అనుగ్రహం కలిగి ఉంటాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us