Zodiac Signs: మేషరాశిలో శని.. ఈ రాశుల వారికి ఆకస్మిక లాభాలు, శుభవార్తలు వింటారు.!

Saturn transit: మీనరాశిలో సంచరిస్తున్న శనిదేవుడు 2027లో మీనరాశి నుంచి మేషరాశిలోకి మారనున్నారు. ఈ సమయంలో కుంభరాశి వారు ఏడున్నర శని నుంచి పూర్తి విముక్తి పొందుతారు. అలాగే రెండు రాశుల యొక్క అశుభ ప్రభావాలు కూడా తగ్గవచ్చు. ఇప్పుడు శని సంచారం వల్ల లాభం పొందుతున్న రాశుల గురించి తెలుసుకుందాం.

Zodiac Signs: మేషరాశిలో శని.. ఈ రాశుల వారికి ఆకస్మిక లాభాలు, శుభవార్తలు వింటారు.!
Saturn Transit

Updated on: Jan 26, 2026 | 9:38 AM

Saturn in Aries: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతీ గ్రహం రాశులను మారుస్తూ సంచరిస్తూ ఉంటుంది. ఒక రాశిలో శని దేవుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారుస్తాడు. ప్రస్తుం శని గ్రహం మీన రాశిలో సంచరిస్తోంది. మీనరాశిలో సంచరిస్తున్న శనిదేవుడు 2027లో మీనరాశి నుంచి మేషరాశిలోకి మారనున్నారు. ఈ సమయంలో కుంభరాశి వారు ఏడున్నర శని నుంచి పూర్తి విముక్తి పొందుతారు. అలాగే రెండు రాశుల యొక్క అశుభ ప్రభావాలు కూడా తగ్గవచ్చు. శని సంచారం వల్ల 12 రాశులలోని కొన్ని రాశులలు విశేష ఫలితాలను పొందనున్నాయి. ఇప్పుడు శని సంచారం వల్ల లాభం పొందుతున్న రాశుల గురించి తెలుసుకుందాం.

సింహరాశి

మేషరాశిలో శని సంచారం కారణంగా సింహరాశి వారు అశుభ ఫలితాల నుంచి విముక్తి పొందుతారు. దీంతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. పని నుంచి తలెత్తే సమస్యలు కూడా తొలగిపోతాయి. ఉమ్మడి వ్యాపారాల ద్వారా మీరు ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ పిల్లల నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. 2027లో మీరు ఊహించని శుభవార్త వింటారు. నిరుద్యోగులకు శని దేవుడి ఆశీస్సులతో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

ధనస్సు రాశి

మేషరాశిలో శని సంచారంతో దనస్సు రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు సమస్యల నుంచి బయపడతారు. పాత పెట్టుబడుల నుంచి మీకు ఆకస్మిక లాభాలు వస్తాయి. శని అనుగ్రహంతో మీకు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. మీరు చేసే పనిలో విజయవంతమవుతారు. విద్య, పని కోసం విదేశాలకు వెళ్తారు. కుటుంబంలో ఇళ్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఆస్తికి సంబంధించిన సమస్యలు కూడా రిష్కారమవుతాయి.

కుంభరాశి

శని మేషరాశి సంచారం వల్ల కుంభరాశి వారికి ప్రత్యక్ష ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశికి శని అధిపతి. కుంభరాశి వారు 2027లో అనేక లాభాలను పొందుతారు. శని ప్రభావం వల్ల మీరు ఎదుర్కొన్న సమస్యలన్నీ పూర్తిగా పరిష్కారమవుతాయి. మీరు మీ కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలు, అందుబాటులో వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించదు.)