Moon Transit: చంద్రుడి అనుగ్రహంతో వీరికి ఐశ్వర్యం..! వారికి ఉద్యోగ యోగం

Moon Transit: అక్టోబర్ 27 నుంచి మూడు రోజుల పాటు చంద్రుడు వృషభ రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచరించనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం, మానసిక ప్రశాంతత, సంపదకు సంబంధించిన శుభ పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ అదృష్టవంతమైన రాశులు ఏవి? ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Moon Transit: చంద్రుడి అనుగ్రహంతో వీరికి ఐశ్వర్యం..! వారికి ఉద్యోగ యోగం
Moon Blessings

Edited By:

Updated on: Oct 23, 2026 | 4:19 PM

ఈ నెల(అక్టోబర్) 27, 28, 28 తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం (Moon Transit in Taurus)
చేయడం జరుగుతోంది. మనసుకు కారకుడైన చంద్రుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. వృషభ చంద్రుడు అనుకూలంగా ఉన్న రాశులవారు ఉన్నత జీవితాన్ని, మానసిక ప్రశాంతతను, సంపదను, ఆరోగ్యాన్ని కోరుకోవడంతో పాటు వీలైనంతగా సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారు ఈ మూడు రోజుల కాలంలో ఏం కోరుకున్నా సమీప భవిష్యత్తులో తప్పకుండా నెరవేరుతుంది. పొరపాటున కూడా ప్రతికూల దృక్పథంతో వ్యవహరించవద్దు.

మేష రాశి

ఈ రాశికి చంద్రుడు ధన స్థానంలో సంచారం చేయడం వల్ల అనేక వైపుల నుంచి ఆదాయ వృద్ధి చెందుతుంది. వీరికి తప్పకుండా ఆకస్మిక ధన లాభంతో పాటు ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు లాభాల పంట పండిస్తాయి. కుటుంబంలో శుభ కార్యాలకు ప్లాన్లు వేయడం మంచిది. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి.

వృషభ రాశి

ఈ రాశిలో చంద్రుడికి ఉచ్ఛ స్థితి కలుగుతున్నందువల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆదాయం అంచనాలను మించి వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. మరింత మంచి ఉద్యోగం లోకి మారే ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి

రాశ్యధిపతి చంద్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితికి వస్తున్నందువల్ల ఈ రాశివారికి అనేక విధాలైన లాభాలు కలుగుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, జీతభత్యాలు పెరగడం వంటివి జరుగుతాయి. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెర వే రుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడ తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.

కన్య రాశి

ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాల్లో స్థిరపడడానికి అవకాశాలు మెరుగుపడతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమవుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వృశ్చిక రాశి

ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుడి ఉచ్ఛ స్థితి వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ఈ రాశివారికి పెళ్లి ఖాయమవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. రాజకీయ నాయకులకు, కళా కారులకు మహర్దశ ప్రారంభం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశీ ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

మకర రాశి

ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రుడు ఉచ్ఛ స్థితిలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి ఊహించని రాజపూజ్యాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us