
ప్రస్తుతం తులా రాశిలో సంచారం చేస్తున్న బుధుడు కొన్ని రాశులకు దుస్థానంలో ఉండడం జరుగుతోంది. జ్యోతిషశాస్త్రంలో 3, 6, 7, 8, 12స్థానాలుగా పరిగణించడం జరుగుతుంది. ఈ రాశులలో బుధుడు సంచారం చేస్తున్నప్పుడు ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు, ప్రణాళికలు, వ్యూహాలు, ప్రయత్నాల్ని వాయిదా వేసుకోవడం మంచిది. డిసెంబర్ 2 వరకు ఈ రాశిలో సంచారం చేసే బుధుడు(.. మేషం, వృషభం, సింహం, వృశ్చికం, మీన రాశులకు దుస్థానంలో ఉన్నందువల్ల ఈ రాశులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ఈ రాశులవారు తప్పకుండా కొన్ని రకాల కష్టనష్టాల పాలయ్యే అవకాశం ఉంది.
ఈ రాశికి సప్తమ స్థానంలో, అంటే మారక స్థానంలో బుధ గ్రహ సంచారం వల్ల ఈ రాశివారు అవ మానాలకు గురయ్యే అవకాశం ఉంది. శత్రువులకు లొంగిపోవలసిన పరిస్థితులు తలెత్తుతాయి. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా మోసపోయే లేదా నష్టపోయే అవకాశం ఉంది. వీరు ఎవరికైనా డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోకపోవడం మంచిది. ఆస్తి వివాదాల్లో, కోర్టు కేసుల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గృహ, ఆస్తి ఒప్పందాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.
ఈ రాశికి బుధుడు షష్ట స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి అనుకున్నదొకటి, అయిందొకటి అన్నట్టుగా ఉంటుంది. ప్లాన్లు, పథకాలు, వాగ్దానాలు, హామీలు ఆశించిన స్థాయిలో ఫలించే అవకాశం ఉండదు. గృహ, ఆస్తి ఒప్పందాల మీద సంతకాలు చేయకపోవడం మంచిది. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో మోసపోవడం లేదా నష్టపోవడం జరుగుతుంది. ఆర్థిక సహాయం పొందిన బంధుమిత్రులు ముఖం చాటేసే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో నష్టపోయే అవకాశం ఉంది.
ఈ రాశికి బుధుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల ఈ రాశివారికి ఏ ప్రయత్న మైనా విఫలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు విరామం ప్రకటించడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు, కార్యకలాపాలు ఒకపట్టాన ముందుకు వెళ్లకపోవచ్చు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో పొరపాట్లు చేయడానికి, తప్పటడుగులు వేయడానికి, తప్పుదోవ పట్టడానికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. హామీలు ఉండవద్దు.
ఈ రాశికి వ్యయ స్థానంలో బుధ సంచారం వల్ల ఈ రాశివారు సమస్యలు, వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఒప్పందాలకు, లావాదేవీలకు, మధ్యవర్తిత్వాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పనులు, ప్రయత్నాల్లో వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో బంధుమిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థికంగా వాగ్దానాలు చేయడం వల్ల, హామీలు ఉండడం వల్ల ఇబ్బందుల్లో పడతారు.
ఈ రాశికి అష్టమ స్థానంలో బుధ సంచారం వల్ల ఆర్థిక విషయాల్లో తప్పటడుగులు, ఆస్తి వివాదాల్లో పొరపాట్లు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఆస్తి వివాదాలు నష్టదాయకంగా పరిష్కారమవుతాయి. ఎక్కడా సంతకాలు చేయకపోవడం, ఒప్పందాలు కుదర్చుకోకపోవడం చాలా మంచిది. ఆస్తిపాస్తుల కొనుగోలు ప్రయత్నాలకు, గృహ, వాహన ప్రయత్నాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. సన్నిహితులు సైతం ఆర్థికంగా నమ్మక ద్రోహానికి పాల్పడే అవకాశం ఉంది.
Also Read: కుజుడి అనుగ్రహం..మార్చి వరకు ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!