Wealth Astrology: మూడు వక్ర గ్రహాలతో.. ఆ రాశుల వారికి సిరుల వర్షం..!

కుంభ రాశిలో బుధుడు వక్రించడం, ఇప్పటికే అక్కడ రాహువు సంచారం చేయడం, అలాగే మిథున రాశిలో వక్రస్థితిలో ఉన్న గురుడు వీటిపై దృష్టి సారించడం వల్ల గ్రహ స్థితులు ఆసక్తికరంగా మారాయి. మార్చి 13 వరకు వక్ర గ్రహాల ప్రభావంతో ఆకస్మిక మార్పులు, అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఈ కాలంలో జీవితం సమూలంగా, సానుకూలంగా మారిపోయే ఛాన్స్ ఉంది.

Wealth Astrology: మూడు వక్ర గ్రహాలతో.. ఆ రాశుల వారికి సిరుల వర్షం..!
Wealth Astrology

Edited By:

Updated on: Feb 27, 2026 | 6:53 PM

కుంభ రాశిలో బుధ గ్రహం వక్రించడం ప్రారంభించింది. ఇప్పటికే అక్కడ శాశ్వత వక్ర గ్రహం రాహువు సంచారం చేస్తోంది. ఇది చాలదన్నట్టు, మిథున రాశిలో వక్రించి ఉన్న గురు గ్రహం ఈ రెండు వక్ర గ్రహాలను ప్రబల దృష్టితో వీక్షిస్తోంది. వక్ర గ్రహాల ప్రభావం పడినప్పుడు కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్చి 13 వరకు ఆకస్మిక పరిణామాలు, అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులవారికి ఈ మూడు వక్ర గ్రహాల కారణంగా జీవితాలు సమూలంగా, సానుకూలంగా మారిపోయే అవకాశం ఉంది.

  1. వృషభం: ధన స్థానంలో సంచారం చేస్తున్న గురువు కారణంగా ప్రస్తుతం ఈ రాశివారి దృష్టి ధన సంపాదన మీద కేంద్రీకృతమై ఉంది. దశమ స్థానంలో, అంటే ఉద్యోగ స్థానంలో రెండు గ్రహాలు వక్రించడం, ధన స్థానంలో గురువు వక్రించడం వల్ల సాధారణంగా ఈ రాశివారికి ఉద్యోగంలో ఊహించని స్థాయిలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కూడా లాభాల బాటపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. రావలసిన డబ్బు పూర్తిగా చేతికి అందే అవకాశం ఉంది.
  2. మిథునం: ఈ రాశిలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి ఉద్యోగపరంగా, సామాజికంగా సరైన గుర్తింపు కోసం, హోదా కోసం తపించే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్న గురువు వక్రించడం, భాగ్యస్థానంలో రాశ్యధిపతి బుధుడు, రాహువు వక్రగతిలో సాగడం వల్ల వీరి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. వీరి సలహాలు, సూచనలతో అధికారులే కాక, బంధుమిత్రులు కూడా బాగా లబ్ధి పొందుతారు. షేర్లు బాగా లాభిస్తాయి.
  3. సింహం: ఈ రాశికి లాభ స్థానంలో గురువు సంచారం వల్ల మనసులోని కోరికలు తీరడం మీద ఈ రాశివారి దృష్టి కేంద్రీకృతమవుతుంది. సప్తమ స్థానంలో బుధ, రాహువులు, లాభ స్థానంలో గురువు వక్రించడం వల్ల వీరికి కలలో కూడా ఊహించని విధంగా గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు ఒక వెలుగు వెలుగుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.
  4. తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న గురువు వక్రించడం వల్ల విదేశాలకు వెళ్లడం, విదేశాల్లో ఉద్యోగం చేయడం వంటి కోరికలు వీరికి కలిగే అవకాశం ఉంది. వక్ర గురువు వల్ల తప్పకుండా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశీ ఆఫర్లు అందుతాయి. పంచమ స్థానంలో బుధ, రాహువుల వక్రగతి వల్ల పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిత్రార్జితం లభిస్తుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.
  5. ధనుస్సు: రాశ్యధిపతి గురువు సప్తమ స్థాన సంచారం వల్ల ఈ రాశివారికి ఎక్కడ, ఏ రంగంలో ఉన్నా అగ్ర స్థానంలో ఉండాలన్న కోరిక బాగా ఎక్కువగా ఉంటుంది. తృతీయ స్థానంలో బుధ, రాహువుల వక్ర గతి వల్ల వీరి ఆశయం కొద్ది ప్రయత్నంతో తప్పకుండా నెరవేరుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో రికార్డు స్థాయి విజయాలు సాధిస్తారు. ఏ రంగంలో ఉన్నా ఉన్నత పదవులు చేపట్టడం, భారీగా జీతభత్యాలు అందుకోవడం జరుగుతుంది. ప్రతిదీ పట్టుదలగా సాధించుకునే అవకాశం ఉంది.
  6. కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గురువు వక్రగతి వల్ల ఈ రాశివారికి గృహ, వాహన, సంతాన యోగాల మీద దృష్టి కేంద్రీకృతమవుతుంది. ఈ రాశిలో బుధ, రాహువుల వక్రగతి వల్ల, పంచమ స్థానంలో గురువు వక్రించి, ఈ రాశిని వీక్షించడం వల్ల వీరి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. గృహ, వాహన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.
Follow Us