Kuja Gochar 2024
ప్రస్తుతం తన మిత్ర క్షేత్రమైన మీన రాశిలో సంచారం చేస్తున్న కుజుడు ఈ నెలాఖరు వరకు అదే రాశిలో ఉండడం జరుగుతుంది. కుజుడి ఈ మీన రాశి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అవిః మేషం, సింహం, కన్య, ధనస్సు, కుంభం, మీనం. ఈ రాశుల వారికి ఈ మీన రాశి కుజుడు ఒక పక్క రాజయోగం కలిగిస్తూనే మరొక పక్క కొన్ని ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంటుంది. ఆదాయం ఇచ్చి ఖర్చులు పెంచడం, పదోన్నతి ఇచ్చి ఒత్తిడి పెంచడం, మిత్రుల్లో కొందరిని శత్రువులుగా మార్చడం, దూర ప్రాంతంలో చిన్న ఉద్యోగం ఇవ్వడం వంటివి జరిగే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశ్యధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో సంచరించడం వల్ల విపరీత రాజయోగం ఏర్పడు తోంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. గృహ, వాహన సౌకర్యాలు అమరుతాయి. నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయి. అయితే, కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతూ ఉంటుంది. ఆస్తులు కొనడంలో సమస్యలు ఎదురవుతాయి. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో చిన్న ఉద్యోగం లభిస్తుంది.
- సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న కుజుడి వల్ల పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. సంపన్న వ్యక్తితో పెళ్లి జరిగే అవకాశముంటుంది. జీవిత భాగస్వామికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఉద్యోగంలో అధికారం చెలాయిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అయితే, వాహనాలు, విద్యుత్తు, అగ్ని సంబంధమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో విలు వైన వస్తువులు లేదా పత్రాలు కోల్పోవడం జరుగుతుంది. మిత్రుల వల్ల నమ్మక ద్రోహం జరుగుతుంది.
- కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ సంచారం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం, ధన యోగం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా శీఘ్ర పురోగతి ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, ప్రయ త్నాలు అనుకూలమవుతాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయ వృద్ధి ఉంటుంది. అయితే, దాంపత్య జీవితంలో తీవ్రస్థాయి విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుం బంలో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో టెన్షన్లు ఉండడం జరుగుతుంది.
- ధనుస్సు: నాలుగవ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఉద్యో గంలో అధికార యోగానికి కూడా అవకాశముంది. సామాజికంగా కూడా ప్రాధాన్యం వృద్ధి చెందు తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అయితే, కుటుంబ జీవితంలో టెన్షన్లు ఎక్కు వగా ఉంటాయి. దాంపత్య జీవితం కూడా ఒత్తిడికి గురవుతుంది. సుఖ నాశనం ఉంటుంది.
- కుంభం: ఈ రాశికి ధన, కుటుంబ స్థానంలో కుజ సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందు తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అయితే, ఖర్చులు బాగా పెరుగుతాయి. డబ్బు వృథా అవుతూ ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తుతాయి. మోసాలకు గురయ్యే సూచనలు ఉన్నాయి.
- మీనం: ఈ రాశిలో సంచారం చేస్తున్న కుజుడి వల్ల ఈ రాశివారి విదేశీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివా దాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. అయితే, జీవిత భాగస్వామితో తీవ్రస్థాయి విభేదాలు తలెత్తుతాయి. ఆర్థిక సంబంధమైన వివాదాలు చోటు చేసుకుంటాయి. కష్టార్జితం దుర్వినియోగం అవుతుంది. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది.