Zodiac Signs: రేపటి నుంచి వీరి పంట పండినట్లే.. ఉద్యోగంలో పురోగతి, వ్యాపారాల్లో లాభాలు.. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..!

Jupiter Retrograde 2023: గ్రహాల్లో అతి పెద్ద గ్రహం, దేవతల రాజు అయిన బృహస్పతి రేపు అంటే సెప్టెంబరు 04న తిరోగమనంలో సంచరించనున్నాడు. అదృష్టం, ఆనందం, సంపదకు కారకుడైన బృహస్పతి తిరోగమనం రాశి చక్రమంలోని కొన్ని రాశుల వారికి దాదాపు 4 నెలల పాటు శుభఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఆయా రాశులవారు శుభఫలితాలతో పాటు ధనప్రాప్తి, కీర్తి ప్రతిష్టలను కూడా పొందుతారు. ఇంతకీ ఆ అదృష్ట రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Zodiac Signs: రేపటి నుంచి వీరి పంట పండినట్లే.. ఉద్యోగంలో పురోగతి, వ్యాపారాల్లో లాభాలు.. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..!
Jupiter Retrograde

Updated on: Sep 03, 2023 | 2:14 PM

Jupiter Retrograde 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ప్రతి నెలా తమ రాశి, నక్షత్రాన్ని మారుస్తాయి. అలాగే ఈ గ్రహాల కదలికలు మానవ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఫలితంగా రాశిచక్రంలోని కొన్ని రాశులవారు లాభపడగా, మరి కొందరు కష్టాలను ఎదుర్కొంటారు. ఈ క్రమంలో గ్రహాల్లో అతి పెద్ద గ్రహం, దేవతల రాజు అయిన బృహస్పతి రేపు అంటే సెప్టెంబరు 04న తిరోగమనంలో సంచరించనున్నాడు. అదృష్టం, ఆనందం, సంపదకు కారకుడైన బృహస్పతి తిరోగమనం రాశి చక్రమంలోని కొన్ని రాశుల వారికి దాదాపు 4 నెలల పాటు శుభఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఆయా రాశులవారు శుభఫలితాలతో పాటు ధనప్రాప్తి, కీర్తి ప్రతిష్టలను కూడా పొందుతారు. ఇంతకీ ఆ అదృష్ట రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

సింహ రాశి: బృహస్పతి తిరోగమనం సింహ రాశి వారికి లాభాలను ఇచ్చేదిగా ఉంటుంది. ఈ సమయంలో ఆగిపోయిన పనులు, తలపెట్టిన కొత్త పనులు సజావుగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, లాభాలను పొందుతారు. ఇంకా నలుగురిలో మంచిపేరు పొందుతారు.

తులా రాశి: బృహస్పతి తిరోగమనం తులా రాశి వారికి కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వివాదాలు, వైవాహిక బాధలు తొలగిపోతాయి. సంతోషం పెరుగుతుంది. యువకులకు పెళ్లి జరిగే అవకాశం, కొత్త ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఇంకా మీకు ఈ సమయంలో పదొన్నతి కూడా లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మేష రాశి: గురు గ్రహ తిరోగమనం మేష రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఫలితంగా నలుగురు మీ గురించి మంచిగా మాట్లాడుకుంటారు, మీ నుంచి సూచనలు సలహాలు తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. ప్రతి పనిని సజావుగా పూర్తి చేసుకుంటారు. కెరీర్‌లో పురోగతి సాధించడంతో పాటు కష్టానికి తగిన ప్రతిఫలాలను పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)