Horoscope Today (29 మే 2023): సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి వ్యాపారాలు పురోగతి సాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకరిద్దరు సన్నిహితులకు సహాయం చేయడం జరుగుతుంది. ఉద్యోగ పరంగా ఆశించిన ప్రయోజనం అనుభవానికి వస్తుంది. బంధు వర్గం నుంచి ఒక మంచి పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్కు అవకాశం ఉంది. ఇతర సంస్థలకు మారే ప్రయత్నాలు సఫలం అవుతాయి.ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా మెరుగు పడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. బంధువులు అపార్థం చేసుకునే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఐటి నిపుణులకు పురోగతి కనిపిస్తోంది. సంతాన యోగానికి అవకాశం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగ పరంగా మంచి స్థితికి చేరుకునే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పు కనిపిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు అప్రయత్నంగా చక్కబడతాయి. వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. బంధువుల వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన వ్యక్తిగత పనులు పూర్తవుతాయి. వ్యాపారాల్లో లాభాల శాతం పెరుగుతుంది. వివిధ వృత్తుల వారికి కొత్త అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి.
సింహం (మఖ, పుబ్బ ఉత్తర 1): వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఇతర వృత్తి నిపుణులు బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురైనా లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితుల్లో మార్పు ఉండకపోవచ్చు. రుణ దాతల దగ్గర నుంచి ఒత్తిడి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి వ్యాపారాలు సజావుగా ముందుకు సాగిపోతాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తి నిపుణులు విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికారయోగానికి అవకాశం కనిపిస్తోంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. రాదని వదిలేసు కున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పరంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలలో మీ ప్రయత్నాలు, మీ ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొన్ని రకాల వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రాంతం నుంచి శుభవార్త ఒకటి అందుతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో చక్కబడుతుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా సాగుతాయి. డాక్టర్లు, లాయర్లకు క్షణం కూడా తీరిక ఉండదు. వృత్తి నిపుణులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. పెళ్లి సంబంధం వాయిదా పడే అవకాశం ఉంది. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమలలో ఇబ్బందులు ఎదురవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు తీపి కబురు అందుతుంది. ఆర్థిక విషయాలలో కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధువులు కొందరు మీ సలహాలను తీసుకుని ప్రయోజనం పొందుతారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ఆహార విహారాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లి మాటలకు దారితీస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా మారు తుంది. వృత్తి నిపుణులకు అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభిస్తుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. అనుకోకుండా పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ప్రేమ జీవితం సాఫీగా సాగిపోతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది. అనవసర ఖర్చులను తగ్గించుకొని పొదుపు పాటించడం అవసరం. ఇతరులకు వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం ప్రస్తుతానికి విరమించడం మంచిది. వృత్తి వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం సొంత ఊరులోనే లభిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు మంచి ఫలితాలను ఇస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. మనసులోని ఒకటి రెండు కోరికలు అనుకోకుండా నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. పెళ్లి సంబంధం విషయంలో చికాకులు ఎదురవుతాయి. బంధువులు కొందరు సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రేమ జీవితంలో ముందడుగు వేస్తారు.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..