మే 16 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో భారీ శుభయోగాలు..

మే 16, 2026 శనివారం రాశిఫలాల ప్రకారం మేష రాశి వారికి ఆదాయ వృద్ధి అవకాశాలు బలంగా కనిపిస్తుండగా, వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రోత్సాహకరమైన పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. మిథున రాశి వారికి అనుకూల సమయం కొనసాగనుండగా, కర్కాటకం నుంచి మీన రాశి వరకు చాలా రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాశుల వారు ఆరోగ్యం, ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిదని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి.

మే 16 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో భారీ శుభయోగాలు..
Rashifal In Telugu 16 May 2026

Edited By:

Updated on: May 16, 2026 | 5:45 AM

దిన ఫలాలు (మే 16, 2026): మేష రాశి వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం కూడా చాలావరకు అనుకూలంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగి పోతాయి. మిత్రులతో విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల కుటుంబంలో విభేదాలు, అపార్థాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. బంధువుల రాక పోకలుంటాయి. ఇంటా బయటా ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఒక శుభవార్త వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం కూడా చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు మీద పడతాయి. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు. స్నేహితుల సహాయంతో కీలకమైన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికరమైన సమాచారం అందుకుంటారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్యం పరవాలేదు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలున్నప్పటికీ, చివరికి అంతా సానుకూలంగా జరిగిపోతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆదాయ వృద్ధి సూచనలున్నాయి. సమయం కాస్తంత అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల బాధ్యతలను మీరు మోయడం వల్ల బాగా ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యులతో సరదాగా, ఆనందంగా కాలక్షేపం చేస్తారు.

కన్య (ఉత్తర 1,2,3, హస్త, చిత్త 1,2)

ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లలు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ ఘన విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి కూడా శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, సకాలంలో, సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సునాయాసంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో అంచనాలను మించి లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. జీతభత్యాలు, ప్రమోషన్ వంటి విషయాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఒత్తిడి ఎక్కువ గానే ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రులతో ఆలోచించి మాట్లాడడం మంచిది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో అవకాశాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి, దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

హద్దులు దాటిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా మారుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులు తమకు లభించిన ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. దూరపు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు చురుకుగా సాగుతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒక కార్యక్రమంలో ఇష్టమైనవారిని కలుసుకుంటారు. దూర ప్రయాణాల్ని చివరి క్షణంలో వాయిదా వేసుకునే అవకాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో చిన్నా చితకా సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్లు, షేర్లు బాగా కలిసి వస్తాయి. జీవిత భాగ స్వామి నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us