Horoscope Today (29-10-2022): ఈ రోజులో ఏ పనులు మొదలు పెట్టాలన్నా.. మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. దీంతో తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 29వ తేదీ )శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశివారు ఈరోజు కొన్ని కీలక పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన సందర్భాల్లో శ్రమ పెరగకుండా సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. బంధు, మిత్రులను కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషన్ని పంచుకుంటారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. చేపట్టిన పనులను ఈజీగా పూర్తి చేస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు.
కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు అధిక ధన వ్యయం చేస్తారు. ప్రతిభకు తగిన పనితీరుతో అందరి ప్రశంసలను అందుకుంటారు. కుటుంబంలో అభిప్రాయం బేధాలు రానీయకండి.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీరు అనుకున్న దానికంటే అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళిక బద్దంగా పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుకుంటారు. ఎవ్వరితోనూ విభేదించకండి.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు పెద్దల సహకారంతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్లారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు మానసికంగా దృఢంగా ముందుకు వెళ్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల వైఖరి మీపట్ల మిశ్రమంగా ఉంటుంది.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. బంధు, మిత్రులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుని శుభ ఫలితాలను పొందుతారు. మానసిక బలంతో ముందుకు సాగుతారు. కీలక కొనుగోలు వ్యవహారంలో లాభం చేకూరుతుంది.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు. చేపట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు లభిస్తాయి.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. సొంత విషయాలపై ఇతరుల ప్రభావం పడకుండా ఉండాల్సి ఉంటుంది. బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే శుభఫలితాలను అందుకుంటారు.
కుంభ రాశి: ఈ రోజు ఈ రాశివారు కీలక విషయాల్లో బాధ్యతలు మరింత పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలను అందుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో నిర్లక్ష్యం వదిలి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. శుభవార్త వింటారు.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా సంతోషముగా ఉంటారు. బంధుమిత్రులతో విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)