Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది.. గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

|

Oct 27, 2022 | 6:20 AM

ఈ రోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. దీంతో తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు అక్టోబర్ 27వ తేదీ ) గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..   

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది.. గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Follow us on

Horoscope Today (27-10-2022): నేటికీ రోజులో ఏ పనులు మొదలు పెట్టాలన్నా.. మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. ఈ రోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. దీంతో తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు అక్టోబర్ 27వ తేదీ ) గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు  కొన్ని కీలక పనులు పూర్తి చేస్తారు. అనుకున్న సమయంలో పనులు పూర్తి చేయాలంటే ఆటంకాలను తొలగించుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. వృత్తి, విద్య, వ్యాపార రంగాల్లోని వారు కాలాన్ని వృధా చేయకుండా మానసికంగా ధైర్యంతో ముందుకు వెళ్ళితే అనుకున్నది సాధిస్తారు . కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు కుటుంబంలో సమస్యలను ఎదుర్కొంటారు. కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. సంతోషంగా కాలాన్ని గడుపుతారు.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలి.  కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా సంతోషంగా గడుపుతారు. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. నూతన వస్తు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు.  ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవ్వరినీ నమ్మకండి.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలోని వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంది. మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు. అనుకూల ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్ ప్రణాళికలతో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లడం ఉత్తమం.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఇబ్బంది తలెత్తే పనులకు దూరంగా ఉండడం మేలు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ధన, ధాన్య లాభాలను అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్ధిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. వాణిజ్య రంగంలోని వారికి కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ధన యోగం ఉంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా ముందుకు అడుగేస్తారు. నిరుత్సాహ పరిచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)