Horoscope Today: శనివారం రాశిఫలాలు.. ఈ రాశివారు ఆకస్మిక ధనలాభం పొందుతారు..

|

Jun 18, 2022 | 6:21 AM

తమ దినఫలాలు ( Daily Horoscope)ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూన్ 18వ తేదీ) శనివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

Horoscope Today: శనివారం రాశిఫలాలు.. ఈ రాశివారు ఆకస్మిక ధనలాభం పొందుతారు..
Horoscope Today
Follow us on

Horoscope Today (18-06-2022): తమ నక్షత్రానికి ఈరోజు ఎలా ఉంటుంది.. జాతక ఫలాలు తెలుసుకోవాలని చాలా మంది భావిస్తారు. మంచి చెడుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో  రోజు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. దీంతో తమ దినఫలాలు ( Daily Horoscope)ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూన్ 18వ తేదీ) శనివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు సొంత ఇంటి కల నెరవేర్చుకునే దిశగా అడుగులు ముందుకేస్తారు. బంధు,మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రారంభించనున్న పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి మొదలు పెట్టె ప్రయత్నం చేస్తారు. కీలక వ్యవహారాలను వాయిదావేసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగులకు అధికారుల సహకారాలు లభిస్తాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు గత కొంతకాలంగా వాయిదాపడుతూ వస్తున్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగుల పనితీరుకు ప్రశంసలను అందుకుంటారు. పెద్దలను కలిసి సంతోషంగా గడుపుతారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  శుభఫలితాలను అందుకుంటారు. సంతోషాన్ని ఇచ్చే శుభవార్తను వింటారు. కీలక వ్యవహారంలో తగిన నిర్ణయం తీసుకుని అందరి ప్రశంసలను అందుకుంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు అధిక శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కీలక సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన చేస్తారు. ఆర్ధికంగా ఖర్చు పెరగకుండా తగిన నిర్ణయాలు తీసుకోవాలి.

తుల రాశి: ఈ రోజు ఈ రాశి వారుకీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అధిక ఖర్చులు చేస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా ప్రణాళిక బద్ధంగా  పనులు చేయాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. మిశ్రమ ఫలితాలను అందుకుంటారు.  మానసిక ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఒక ముఖ్యమైన విషయంలో కుటుంబ సభ్యుల సహకారంతో పనులను పూర్తి చేస్తారు.  శుభ వార్త వింటారు. మీ ప్రతిభకు తగిన ప్రశంసలను పొందుతారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండడం మేలు.  శుభఫలితాలను అందుకుంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు మానసిక ధైర్యంతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అధిక శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంది. ఒక వ్యవహారంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు అనవసర ఖర్చులు చేస్తారు. ఆర్ధికలావాదేవీల విషయంలో తగిన నిర్ణయాలను తీసుకుంటే.. ఆశించిన ఫలితాలను పొందుతారు. మానసికంగా దైర్యంగా ఉండాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)