Horoscope Today (17-06-2022): రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా ఉంటుందో అంటూ వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూన్ 17వ తేదీ )శుక్రవారం రోజు రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రణాళిక ప్రకారం సహనం కోల్పోకుండా పనులను నిదానంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మానసికంగా ధృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. శత్రువుల విషయంలో ఆవేశం, తొందర పాటు పడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. ముఖమైన పనులలో ఇతరుల సాయం అందుతుంది. వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది.
కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు నూతన వస్తువులు, నగలు కొనుగోలు అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహాయసహకారాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల సాయం అందుతుంది. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి శుభకాలం. ముఖ్యమైన నిర్ణయాలను ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితం అందుతుంది. శుభవార్త వింటారు. మానసికంగా సంతోషంగా గడుపుతారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు అనవసర వ్యయం చేయాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారం, ఉపాధి రంగాల్లోని వారు ఓర్పు, పట్టుదలతో పనిచేయాల్సి ఉంటుంది. బంధు, మిత్రులతో వాదనలకు దూరంగా ఉండడం మేలు. కుటుంబ సభ్యులతో విబేధాలు వచ్చే అవకాశం ఉంది.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి బంధు, మిత్రుల సహాయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోని వారు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. చేపట్టే పనిలో అనుకూల ఫలితాలు లభిస్తాయి.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు ఆర్థికంగా శుభఫలితాలను అందుకుంటారు. కీలక విషయాల్లో ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. గోమాత సేవ వలన మానసికంగా సంతోషంగా ఉంటారు.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు మానసిక ధైర్యంతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. ఇష్టమైన వ్యక్తులతో విందు ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండడం మేలు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా సంతోషంగా ఉంటారు. బంధు, మిత్రులతో విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలోని వారు శుభఫలితాలు అందుకుంటారు.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శుభవార్తను వింటారు. భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిఉంటుంది.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా దృఢంగా ముఖ్యమైన విషయాల్లో తగిన ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని అవసరానికి తగిన సాయం అందుకుంటారు. కీలక విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)