Horoscope Today: కెరీర్‌లో వారు పురోగతి సాధిస్తారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దినఫలాలు (ఫిబ్రవరి 23, 2026): మేష రాశి వారికి ఆర్థికంగా దీర్ఘకాలిక లాభాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. వృషభ రాశి వారు కెరీర్ పరంగా పెద్ద విజయాలు సాధించే అవకాశం ఉంది. కెరీర్ పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మిథున రాశి వారు ప్రయాణాల వల్ల లాభాలు ఆర్జిస్తారు. అలాగే మాటకారితనం వల్ల విజయానికి దారితీస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: కెరీర్‌లో వారు పురోగతి సాధిస్తారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 23 Feb 2026

Edited By:

Updated on: Feb 23, 2026 | 5:31 AM

Today Horoscope (February 23, 2026): మేష రాశి వారు ఆర్థికంగా దీర్ఘకాలిక లాభాలు పొందే అవకాశముంది. వృషభ రాశి వారు కెరీర్ పరంగా పెద్ద విజయాలు సాధించే అవకాశం ఉంది. మిథున రాశి వారు ప్రయాణాల వల్ల లాభాలు ఆర్జించే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

12 రాశులకు సోమవారం (23 ఫిబ్రవరి 2026)నాటి రాశిఫలాలు:

  1. మేషం (Aries): మీకు ఆశయాలు, నాయకత్వ పటిమ పెరుగుతాయి. వృత్తిపరంగా పెద్ద పురోగతి ఉంటుంది. కానీ తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆర్థికంగా దీర్ఘకాలిక లాభాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
  2. వృషభం (Taurus): వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. భావోద్వేగం పరంగా స్థిరంగా ఉంటారు. కెరీర్ పరంగా పెద్ద విజయాలు సాధించే అవకాశం ఉంది. కీలక విషయాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.
  3. మిథునం (Gemini): మేధస్సు, ఆధ్యాత్మిక విషయాల్లో పురోగతి ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం లేదా ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. మీ మాటకారితనం వల్ల విజయానికి దారితీస్తాయి.
  4. కర్కాటకం (Cancer): జీవితంలో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. వృత్తిపరంగా ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. భావోద్వేగాల విషయంలో స్పష్టత లభిస్తుంది.
  5. సింహం (Leo): భాగస్వామ్యాలు, పొత్తులు బలపడతాయి. ఇతరుల సహకారం వల్ల వృత్తిలో విజయం సాధిస్తారు. అయితే అహంకారానికి దూరంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు సూచిస్తున్నాయి.
  6. కన్య (Virgo): పనుల్లో ఖచ్చితత్వం, ఏకాగ్రత పెరుగుతాయి. కెరీర్‌లో పురోగతి ఉంటుంది. స్నేహం, కుటుంబ సంబంధాలు బలపడతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.
  7. తుల (Libra): మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. కళాత్మక రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. కొత్త పెట్టుబడుల వల్ల ఆదాయం పెరుగుతుంది.
  8. వృశ్చికం (Scorpio): ఈ రాశి వారికి కుటుంబ వృద్ధి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆస్తి లేదా ఇంటి పనులు విజయవంతంగా సాగుతాయి. స్నేహితులు, కుటుంబీకులతో శాంతంగా మాట్లాడటం ముఖ్యం.
  9. ధనుస్సు (Sagittarius): కమ్యూనికేషన్ పరంగా కొత్త పుంతలు తొక్కుతారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మంచి సమయం. స్వల్పకాలిక పెట్టుబడుల వల్ల ఆర్థిక వృద్ధి ఉంటుంది.
  10. మకరం (Capricorn): ఆర్థికంగా పట్టు సాధిస్తారు. పెట్టుబడుల నుండి మంచి లాభాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతాల పెంపు సూచనలు ఉన్నాయి. కుటుంబ విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి.
  11. కుంభం (Aquarius): మీ రాశిలో గ్రహాల అనుకూలత వల్ల మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది. కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. ఇంటా బయటా మీకంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.
  12. మీనం (Pisces): ఈ రాశి వారు ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెడతారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇదే అనుకూల సమయం. విజ్ఞాన రంగంలో ఉన్నవారికి శుభ ఫలితాలు ఉంటాయి.

గమనిక: ఇది గ్రహాల స్థితిగతుల ఆధారంగా ఇచ్చిన సామాన్య సమాచారం మాత్రమే. మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.

Follow Us