Horoscope Today: హమ్మయ్య.. వారి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి ఇలా..

Daily Horoscope (April 23, 2026): గురువారానికి రాశిఫలాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. మేష రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి సూచనలు ఉండగా, వృషభ రాశి వారు సమస్యల నుంచి బయటపడతారు. మిథున రాశి వారికి ప్రాధాన్యం పెరుగుతుంది. కర్కాటకం నుంచి మీనం వరకు చాలా రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత విషయాల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి.

Horoscope Today: హమ్మయ్య.. వారి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి ఇలా..
Rashifal In Telugu 23 April 2026

Edited By:

Updated on: Apr 23, 2026 | 7:03 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 23, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి లేదా హోదా పెరగడానికి అవకాశం ఉంది. శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. వృషభ రాశి వారు ఉద్యోగంలో కొన్ని సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. మిథున రాశి వారిపై ఉద్యోగంలో అధికారులు బాగా ఆధారపడతారు. అన్ని విధాలా ప్రాధాన్యం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో పదోన్నతికి లేదా హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆశించిన శుభవార్తలు వింటారు. శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. కుటుంబ జీవితాన్ని చక్కబెట్టడం మీద దృష్టి పెడతారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. చేపట్టి పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో కొన్ని సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా పుంజుకుంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు, కార్యకలాపాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటా బయటా శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యానికేమీ భంగం ఉండదు. వ్యక్తి గత, ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారులు మీ మీద బాగా ఆధారపడతారు. అన్ని విధాలా ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల పరిధిని విస్తరించే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం ‍సాధిస్తారు. ఆర్థిక కార్యకలాపాలు అనుకూలంగా పురోగమిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు బాగా వృద్ధి చెందుతాయి. కొందరు మిత్రులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. కుటుంబంతో దైవ దర్శనాలు చేసుకుంటారు. తల్లితండ్రులు మీ దగ్గరికి వస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపా రాల్లో ఆశించిన లాభాలుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. జీవిత భాగస్వామితో షాపింగ్ చేస్తారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు చక్కబడతాయి. వ్యాపారాలు లాభసా టిగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. దూరపు బంధువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహ కారంతో ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఎవరికీ హామీలు ఉండ వద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందు తాయి. కుటుంబంలో శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. అనవసర పరిచయాలు ఏర్పడతాయి. విలాస జీవితం మీద బాగా ఖర్చు అవుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆస్తి వివాదం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. తల్లితండ్రుల నుంచి అవసర మైన సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం పరవాలేదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి బాగా డిమాండ్ పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఇంటా బయటా మీ మాటకు, చేతకు తిరుగుండదు. పరిచయస్థుల ద్వారా పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లల్లో చదువుల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి సమస్య ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి ప్రాధాన్యం పెరుగుతుంది. వివిధ రంగాలకు చెందిన వారికి ఆదాయం పెరుగుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. కొందరు బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం పెట్టుకోవద్దు. ఇంటా బయటా మీ ఆలోచనలకు, సలహాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడ తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను అందు కుంటారు. ఉద్యోగంలో సిబ్బంది నుంచి ఆదరాభిమానాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఖర్చుల్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆపర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us