Horoscope Today (09-12-2022): రోజు మొదలైతే మనిషి ముందుగా ఆలోచించేది.. ఈ రోజు తమకు ఎలా ఉంటుందనే విషయం.. దీంతో రోజులో తమకు జరిగే మంచి, చెడుల గురించి తెలుసుకుని అందుకు అనుగుణంగా తాము నడుచుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఈ నేపథ్యంలో తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈరోజు (డిసెంబర్ 9వ తేదీ ) శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రోజు ఈ రాశివారు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. వివాదాలకు దూరంగా ఉండడం మేలు. ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను తగ్గించుకునేలా చర్యలు తీసుకోవడం మేలు.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా ఇబ్బంది పడే సంఘటన చోటు చేసుకుంటుంది. చేపట్టిన పనులను పుర్తి చేయడంలో ఇబ్బంది పడతారు. బంధు, మిత్రులతో వివాదం నెలకొనే అవకాశం ఉంది.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారికి శుభకాలం. కుటుంబ సభ్యుల సహకారం ఉంది. పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. అవసరానికి సహాయం అందుకుంటారు. ముఖ్యమైన పనుల విషయంలో ఓర్పుగా వ్యవహరించండి.
కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా సక్సెస్ అందుకుంటారు. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. కీలకనిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. కీలక సమయాల్లో తగిన నిర్ణయాలను తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఇష్టమైనవారితో గడుపుతారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు పనుల విషయంలో కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. బంధు, మిత్రముల సహకారంతో ముందుకు వెళ్లారు. ఉత్సాహంగా పనిచేస్తారు.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు ప్రయాణల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక శ్రమ పడతారు. ఇతరుల సహకారంతో ముందుకు వెళ్లి.. మంచి ఫలితాలు అందుకుంటారు. శ్రమ అధికం అవుతుంది. .
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. కీలక వ్యవహారాల్లో బాధ కలిగే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అధిక పడాల్సి ఉంటుంది.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి ఆర్ధిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. సంతోషంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. విజయావకాశాలు మెరుగవుతాయి.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో విజయాలను సొంతం చేసుకుంటారు.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. అనవసర ధన వ్యయం చేస్తారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వాదం పొందుతారు.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ఇతరుల సహకారంతో ప్రారంభించిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. నిర్లక్ష్యాని వీడి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. పట్టుదలతో విజయం సాధిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)