Horoscope Today(24th May): వారికి ఆకస్మిక ధనలాభ సూచన.. 12 రాశులవారికి గురువారం రాశిఫలాలు

| Edited By: Aravind B

May 25, 2023 | 6:04 AM

Rashi Phalalu(25 మే 2023): సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Horoscope Today(24th May): వారికి ఆకస్మిక ధనలాభ సూచన.. 12 రాశులవారికి గురువారం రాశిఫలాలు
Horoscope 25th May 2023
Follow us on

Horoscope Today (25 మే 2023): సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఒకటి కంటే మించి ఆఫర్లు వస్తాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అదనపు ఆదాయం కోసం ఆరాటం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. రుణ సమస్యలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు.
ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా ముందుకు సాగుతాయి. ఐటీ నిపుణులకు విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. బంధువుల రాకతో కుటుంబంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం
ఉంది. సంతానయోగ సూచనలున్నాయి. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. అనవసర ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. సామాజిక సేవా రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది.మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. వ్యక్తిగత జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. పిల్లలు ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆచితూచి మాట్లాడండి. కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యం కావచ్చు. స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఆదాయపరంగా శుభవార్త వింటారు. డబ్బు జాగ్రత్త.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల కొన్ని వ్యక్తిగత విషయాల్లో ఇబ్బందులు పడతారు. మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకునే వారు ఉంటారు. వివాహ ప్రయత్నాలు కాస్తంత అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికి అనారోగ్యం చేస్తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో అధికారులు, సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): అన్ని విధాలుగాను కలిసివచ్చే కాలం ఇది. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల కొద్దిగా నష్టపోతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ పరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు చదువుల్లో
గుర్తింపు తెచ్చుకుంటారు. సంతానం లేని వారు సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. సన్నిహితులను ఆర్థికంగా ఆదుకుంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): చాలా కాలంగా పీడిస్తున్న ఓ వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. అదనపు సంపాదనకు సమయం అనుకూలంగా ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మంచి చోట పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక రంగాల్లో ఉన్నవారు బాగా బిజీ అవుతారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. మొండి బాకీ ఒకటి అనుకోకుండా వసూలు అవుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధుమిత్రులలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంపాదన స్థిరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి, తిప్పట ఎక్కువగా ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. విదేశాల నుంచి ఆశించిన కబురు అందుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి నిపుణులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొందరు స్నేహితులు అపార్ధాలతో దూరమయ్యే అవకాశం ఉంది.ఇల్లు కొనుక్కునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో పలుకుబడి ఎక్కువవుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. లాయర్లకు, డాక్టర్లకు, ఐటీ నిపుణులకు అనుకూల సమయం.ఆర్థిక లావాదేవీలు అంతగా మంచి ఫలితాలనుఇవ్వకపోవచ్చు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ రాశి వారికి కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెంచుకునేందుకు ఆలోచన చేస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలగజేస్తుంది. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఇబ్బందుల్లో ఉన్న బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా అనారోగ్యంతో అవస్థ పడే సూచనలున్నాయి. ఎంతో శ్రమ మీద ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చాలావరకు అనుకూలిస్తాయి. మిత్రుల వల్ల చిక్కుల్లో పడతారు. అతి ముఖ్యమైన కోర్టు కేసు ఒకటి వాయిదా పడుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభంచకపోవచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. పిల్లల వల్ల సంతోషం పొందుతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా పరిష్కారం
అవుతుంది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..