Horoscope Today: వారికి ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Oct 20, 2023 | 5:05 AM

దినఫలాలు (అక్టోబర్ 20, 2023): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారు వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగావకాశాలు అందుతాయి. మిథున రాశికి చెందిన వ్యాపారులకు సంపాదన పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...?

Horoscope Today: వారికి ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 20th October 2023
Follow us on

దినఫలాలు (అక్టోబర్ 20, 2023): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారు వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగావకాశాలు అందుతాయి. మిథున రాశికి చెందిన వ్యాపారులకు సంపాదన పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గురు, శని గ్రహాల అనుగ్రహం ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో సమయం అనుకూలంగా ఉంది. జీతభత్యాలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. శుభ కార్యాల మీద, కుటుంబం మీద ఖర్చులు పెరగవచ్చు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

శని, శుక్ర గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్న ఫలితంగా వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగావకాశాలు అందుతాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కార్యసిద్ధి ఉంటుంది. అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యులతో కలిసి తీసుకోవడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గురు, శుక్రుల వంటి శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారులకు సంపాదన పెరుగుతుంది. తోబుట్టువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగం మారడా నికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు తమకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక స్థిరత్వాలు చోటు చేసుకుంటాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

బుధ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఉద్యోగ సంబంధమైన ఎటువంటి ప్రయత్నమైనా సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయం సాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు, కార్యకలాపాలు, పనులు సంతృప్తికరంగా, సకాలంలో పూర్తవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

గురు గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవ కాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, ఐ.టి నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగ సంబంధమైన ఎటువంటి ప్రయత్నం అయినా కలిసి వస్తుంది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులకు అవ కాశం ఉంది. బంధుమిత్రులతో విందులు వినోదాలకు ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. సోదర వర్గంతో అనుకోకుండా స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

బుధ, శని గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్య సిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. ఆశించిన స్థాయిలో లాభాలు పెరు గుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలలో, ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందు తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

గురు, శుక్ర, బుధ గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ సంబంధమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. దూర ప్రాంతంలో ఉంటున్న బంధువులతో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారే అవకాశం ఉంది. సతీమణికి గౌరవమర్యాదలు పెరుగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

రాహు, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలను, పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు నెర వేరుతాయి. ఇంటా బయటా చాలావరకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపా రాలు నిలకడగా కొనసాగుతాయి. ఉద్యోగ జీవితం కూడా ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

గురు, శని, శుక్ర గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు సానుకూలం అవుతాయి. నిదానంగా, నిబ్బరంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు, ఆర్థిక విషయాల్లో సమయం అన్నివిధాలుగానూ అనుకూ లంగా ఉంది. ఆరోగ్యం కాపాడుకుంటే మీకు ఇతర విషయాల్లో తిరుగుండదు. వ్యాపారాలు కూడా అంచనాకు మించి లాభాలు అందిస్తాయి. మొత్తం మీద రోజంతా చాలావరకు ప్రశాంతంగా గడిచి పోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

శని, కుజ, బుధ గ్రహాల అనుగ్రహం వల్ల లాభదాయకమైన స్నేహాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కొన్న కీలకమైన ఆర్థిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపా రాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడ తారు.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

శుక్రుడు, బుధుడు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో మీ వ్యూహాలు, ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి అధికారులకు సన్నిహితం అవుతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయ త్నాలు పురోగతి చెందుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండాలి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

శుభ గ్రహమైన గురువు అనుకూలంగా ఉన్నందువల్ల, ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఇతరులతో సంబంధం లేకుండా మీ ప్రయత్నాలను పట్టుదలగా పూర్తి చేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి.