Rasi Phalalu 18th april: చాలాసార్లు మనకు అవసరం లేని విషయాల్లో కూడా మనం తల దూర్చడానికి ప్రయత్నిస్తుంటాం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది. ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలు చిన్నాభిన్నం అవడంతోపాటు.. పలు సమస్యలు ఎదురవుతాయి. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆదివారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా లేవు. మరికొన్ని రాశుల వారికి సమయం అనుకూలంగా ఉంది. అసలు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో.. ఓ సారి చూద్దాం..
మేషం: ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. చేపట్టినటువంటి పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సుబ్రహ్మణ్య స్వామి వారికి పొంగలిని, చలివిడిని నివేదన చేసుకోవడం మంచిది.
వృషభరాశి: ఈ రాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల నుంచి కొన్ని వార్తలు అందుతుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శివాభిషేకం, అన్నపూజ చేసుకోవడం మంచిది.
మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు నూతన ఉద్యోగ లాభాలు కలిసి వస్తాయి. ఆహార, విహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పేద వారికి కాయగూరలు సాయం చేయడం మంచిది.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు చిన్న చిన్న మానసికమైనటువంటి వత్తిళ్లు ఏర్పడుతాయి. ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శివపంచాక్షరి జపం మానసికమైనటువంటి ప్రశాంతతను కలగజేస్తుంది.
సింహ రాశి: ఈ రాశివారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తారు. నవగ్రహస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కన్యా రాశి : ఈ రాశివారు ఈ రోజు నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. వేర్వేరు రూపాల్లో విందు, వినోదపరమైనటువంటి కార్యక్రమాల కోసం ధనాన్ని సమకూర్చుకుంటుంటారు. పేదవారికి అన్నదానం చేసుకోవడం మంచిది.
తుల రాశి: ఈ రాశి వారు ఈ రోజు షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక ప్రగతి ఉంటుంది. సంఘంలో పోటీతత్వం కూడా పెరుగుతుంది. నవగ్రహస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ధనస్సు రాశి: ఈ రాశి వారు ఒప్పందాలను సమీక్ష చేసుకుంటుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదిత్యహృదయస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు వేర్వేరు రూపాల్లో ప్రయాణాలు చేయాల్సిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. విశేషమైనటువంటి శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కుంభ రాశి: ఈ రాశి వారు రావలసిన ప్రయోజనాల గురించి ప్రయత్నాలు చేస్తుంటారు. విదేశీ సంబంధమైనటువంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి. దుర్గా అమ్మవారి ఆరాధన మేలు చేస్తుంది.
మీన రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికపరిస్థితులు కొంత మిశ్రమంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పేదవారికి అన్నదానం చేయడం, గో సేవ చేసుకోవడం మంచిది.
Also Read: