Horoscope Today: వారి జీతభత్యాలు పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope(September 10, 2025): మేష రాశి వారి ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా, ఆశాజనకంగా సాగిపోతుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన ఉద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారి జీతభత్యాలు పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 10 September 2025

Edited By:

Updated on: Sep 10, 2025 | 5:31 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 10, 2025): మేష రాశి వారి ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గి..అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా, ఆశాజనకంగా సాగిపోయే అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన ఉద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. శత్రు, రోగ, రుణ బాధల ఒత్తిడి నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలను తేలికగా అధిగమిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఏ రంగానికి చెందిన వారికైనా శీఘ్ర పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా, ఆశాజనకంగా సాగిపోతుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అన్ని వ్యవహారాలనూ సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోకుండా కొన్ని వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. బంధుమిత్రులు మీ సలహాల వల్ల లబ్ధి పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి రాజీ మార్గంలో పరిష్కారమవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి జీవితాన్ని అనుభవిస్తారు. అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వారితో పరిచయాలు విస్తరిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రేమ వ్యవహారాలు జోరందుకుంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారులకు నమ్మకం పెరిగి, బరువు బాధ్యతలను పెంచుతారు. ఇంటాబయటా శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇతరులకు సాయం చేసే స్థితిలో ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవలసిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో చికాగులుంటాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి రాబడి, డిమాండ్ వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనుకోకుండా ఒకటి రెండు ముఖ్యమైన శుభవార్తలు వింటారు. కుటుంబంలోనూ, ఉద్యోగంలోనూ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో చొరవ పెరుగుతుంది.

వృ‌శ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడి, మనశ్శాంతి లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అధికారులు మీ ప్రతిభను, శ్రమను గుర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాలార్జిస్తాయి. కుటుంబ సమస్యల్ని తేలికగా అధిగమిస్తారు. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలను విజయవంతంగా చక్కబెడతారు. ఆదాయం పెరిగే మార్గాలను అనుసరిస్తారు. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటిస్తారు. వ్యక్తిగత సమస్యల్లో ముఖ్యమైనవి పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ముఖ్య మైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు ఆశించిన స్థాయిలో తగ్గుముఖం పడతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. కొందరు మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు మంచివి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణకు లోటుండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొందరు బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు పడే సూచనలున్నాయి. పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ఆశించినంతగా రాబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ప్రేమ వ్యవహారాలు బాగా హుషారుగా సాగిపోతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

సాధారణంగా ఆదాయానికి లోటుండదు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. అనుకోకుండా కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తల్లితండ్రుల ద్వారా ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది,. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు చాలావరకు సాఫీగా సాగిపోతాయి.