Horoscope Today: ఆ రాశుల వారు అస్సలు తొందరపడకూడదు.. గురువారం రాశి ఫలాలు.. ఏ విధంగా ఉన్నాయంటే?

|

Apr 15, 2021 | 7:48 AM

Rasi Phalalu 15th april: మనకు అవసరం లేని విషయాల్లో కూడా మనం తల దూర్చడానికి చాలాసార్లు ప్రయత్నిస్తుంటాం. మంచి చేయబోతే

Horoscope Today: ఆ రాశుల వారు అస్సలు తొందరపడకూడదు.. గురువారం రాశి ఫలాలు.. ఏ విధంగా ఉన్నాయంటే?
Horoscope Today
Follow us on

Rasi Phalalu 15th april: మనకు అవసరం లేని విషయాల్లో కూడా మనం తల దూర్చడానికి చాలాసార్లు ప్రయత్నిస్తుంటాం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది. ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటాయి. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గురువారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో.. ఓ సారి చూద్దాం..

మేషం: ఈ రాశి వారికి ఈ రోజు వేరు వేరు రూపాల్లో స్నేహితులను కోలుసుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతుంటాయి. స్థిరమైన ఆలోచనల ద్వారా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. సహాయం కోరి వచ్చిన పేద వారికి సహకారం అందించడం చాలా మంచిది.

వృషభరాశి: ఈ రాశి వారికి పనుల్లో మంచి పురోభివృద్ది లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూలతలు సాధించవచ్చు. మహాలక్ష్మి అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు నూతన ఉద్యోగ లాభాలు కలిసి వస్తాయి. ఆహార, విహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పేద వారికి కాయగూరలు సాయం చేయడం మంచిది.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు విందు వినోదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాత్మకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుండాలి. చంద్రగ్రహ అర్చన మేలు చేస్తుంది.

సింహ రాశి: ఈ రాశివారు కోర్టు వ్యవహారిక విషయాల్లో తొందరపడకూడదు. అనుకున్నటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తుండాలి. శ్రీరామ జయరామ జయజయజయ రామ నామాన్ని అధికంగా జపం చేసుకుంటే మంచిది.

కన్యా రాశి : ఈ రాశివారు ఈ రోజు సభలు, సమావేశాల్లో పాల్గొంటుంటారు. గౌరవ సన్మానాలను కూడా పొందగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కార్తీకేయస్వామి నామస్మరణ, అర్చన మేలు చేస్తుంది.

తుల రాశి: ఈ రాశి వారు ఈ రోజు రావలసిన బాకీలు వసూలు చేసుకుంటుంటారు. బంధువులు, సోదరులతో సమావేశమవుతారు. తామర పుష్పాలతో మహాలక్ష్మి అర్చన మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులను కలుసుకుంటుంటారు. వృత్తి వ్యాపారాత్మకమైన భావనలు పెరుగుతుంటాయి. ఆంజనేయ స్వామి దండకస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

ధనస్సు రాశి: ఈ రాశి వారు పెట్టుబడి విషయాల్లో తొందరపడకూడదు. పెద్దవారి సలహాలు మేలు చేస్తుంటుంది. విష్ణు సహస్రనామస్తోత్ర మేలు చేస్తుంది.

మకర రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతుంటాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. శివారాధన మేలు చేస్తుంది.

కుంభ రాశి: ఈ రాశి వారు చేపట్టినటువంటి పనులు, వ్యవహారిక విషయాలు కొంత ఆలస్యమవుతుంటాయి. సాంఘికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. దుర్గా అమ్మవారి ఆరాధన మేలు చేస్తుంది.

మీన రాశి: ఈ రాశి వారు ఈ రోజు చేపట్టినటువంటి పనులు సానుకూలంగా పూర్తవుతాయి. ఆరోగ్య విషయాలు కుదుటపడుతుంటాయి. నవగ్రస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

Also Read:

Rains : విజయవాడ, మహబూబ్ నగర్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, హైదరాబాద్, నల్గొండ, యాదాద్రి జిల్లాలకు వర్ష సూచన